Megastar Chiranjeevi Birthday: తెలుగులో ఎంతోమంది హీరోలు వచ్చారు.. ఉన్నారు.. వస్తారు.. కానీ తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ అంటే గుర్తొచ్చేది మాత్రం చిరంజీవి పేరే. తరాలు మారిన.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయనకున్న స్థానం మాత్రం మారదు.
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చే ఎంతోమంది కుర్ర హీరోలకు ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్. సినీ రంగంలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కూడా సూపర్ స్టార్ అవ్వచ్చు అని రుజువు చేసిన వారిలో చిరంజీవి ముందు స్థానంలో ఉంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనూ నిలదొక్కుకుని, కృష్ణ శోభన్ బాబులకు పోటీగా నిలబడి.. ఎగిసిపడ్డ కెరటం మన మెగాస్టార్.
ఎన్టీఆర్ తరువాత ఆ టాప్ 1 పొజిషన్ సంపాదించుకున్న హీరో చిరంజీవి. అప్పటి వరకు మూసధోరణిలో పోతోన్న పరిశ్రమ రూపురేఖలను మార్చేశారు చిరంజీవి. తన మాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఆటలు, డ్యాన్సులు ఇలా అన్నింటితో తెలుగు రాష్ట్రాలను ఆశ్చర్యపరిచారు. చిరంజీవి వేసే స్టెప్పులు..హెయిర్ స్టైల్, చిరంజీవి వేసుకున్న డ్రెస్సులు .. చెప్పే డైలాగ్ లు ఇలా ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా మాస్ అనే పదానికి పర్యాయపదంగా మారాడు ఈ మాస్టర్.
ఇక బాక్సాఫీస్ రికార్డులకు ఘరానా మొగుడు గా నిలిచారు. హీరోయిజం అనే మాటకు కొత్త రూపును తెచ్చిన చిరంజీవి సినీ చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఆయన కెరియర్లు ఆయన చూడని సూపర్ హిట్లు లేవు.. ఇండస్ట్రీ హిట్లు లేవు .బ్లాక్ బస్టర్లు లేవు.. అయినవి ఏవన్నా సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. ఆయన నటన మాత్రం ఏ సినిమాలోని ఫ్లాప్ అవ్వలేదు. అది డిజాస్టర్ సినిమా అయినా కానీ అందులో పాత్రకు చిరంజీవి 100% న్యాయం చేసి ఉంటారు.
ఇక సినీ హీరోగానే కాకుండా రియల్ హీరో కూడా మన చిరు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడి రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు. అలాంటి మెగాస్టార్ ని చూస్తూ పెరగడం మన అదృష్టం…ఇలానే తరువాత తరాల వారికి కూడా చిరంజీవి ఆదర్శంగా నిలవాలి అని.. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని.. మన మెగాస్టార్ కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం..