Varanasi: రాజమౌళితో సినిమా చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. అతని సినిమాల్లో హీరోలకు నటులుగా గొప్ప పేరైతే వస్తోంది. కానీ దాని వెనుక హీరోలు పడిన కష్టం ఎవ్వరికి కనిపించదు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఎంతలా కష్టపడ్డాడో మనందరికి తెలిసిందే. ఇంకా ‘త్రిబుల్ ఆర్’ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా బాడీ ఫిట్నెస్ లో గాని సినిమాకు సంబంధించిన షూటింగ్ లో గాని తీవ్రమైన కసరత్తులు చేశారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు వారణాసి సినిమా కోసం కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు తన కెరియర్ లో డ్యూయల్ రోల్ నటించలేదు. ఇక లుక్కు విషయంలో కూడా ఆయన అన్ని సినిమాల్లో ఒకే రకమైన లుక్ ను ఫాలో అవుతూ వరుస సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. కానీ వారణాసి సినిమా కోసం మహేష్ బాబు 5 గెటప్పుల్లో కనిపించాల్సిన అవసరమైతే ఉందట. ఇక ఆ ఐదు గెటప్పుల్లో కూడా మహేష్ బాబు డిఫరెంట్ గా కనిపించి ప్రేక్షకులను మైమరిపింపజేయాలని రాజమౌళి చెబుతున్నాడట.
ఈ ఐదు గెటప్పుల కోసం ఆయన తీవ్రమైన కసరతులు చేస్తున్నాడు. ఒక్కో గెటప్ లో ఒక్కో వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ గా తనను ప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నం చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి సైతం మహేష్ బాబు క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కొన్ని రోజుల గడువు పెట్టాడు. ఆ సమయంలోనే అతను తన బాడీని అలా మౌల్డ్ చేసుకోవాలి.
లేకపోతే మాత్రం క్యారెక్టర్ తేలిపోతోందని రాజమౌళి చెప్పాడట. ఈ మూవీ పాన్ వరల్డ్ లో చేస్తున్నారు కాబట్టి చాలా ప్రస్టిజియస్ గా ఈ సినిమాను తెరకెక్కించాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో ఏ మాత్రం తేడా జరిగినా కూడా సినిమా మొత్తానికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి మహేష్ బాబు దీని మీద చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారట. మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఏ సినిమా కోసం ఇంతలా కష్టపడలేదు. అతను ఎప్పుడు సెక్యూర్ జోన్ లో సినిమాలు చేసుకుంటూ వస్తాడు. కానీ రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో నెక్స్ట్ లెవెల్లో కసరత్తులు చేయిస్తూ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు…