Tollywood: దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగింది. 2014లో ఆ కల సాకారం అయ్యింది. యూపీఏ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విభజించింది. ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ప్రయాణం చేస్తున్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. మరో కొత్త డిమాండ్ ని తెరపైకి తెచ్చాయి. ఏపీకి చెందిన దర్శకులు, నిర్మాతలు, నటులు హైదరాబాద్ వీడి పోవాలంటూ తెలంగాణ వాదులు, కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఆంధ్రాకు చెందిన సినిమా ప్రముఖులు తెలంగాణ సంపద దోచుకుంటున్నారు. ఇక్కడి వారికి అవకాశాలు రాకుండా చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టాలీవుడ్ లో ఆధిపత్యం సాగిస్తున్న ఏపీకి చెందిన ప్రముఖులు తెలంగాణను వీడకపోతే.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో ఉద్యమాలు మొదలుపెడతాం అని ఓపెన్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం టాలీవుడ్ ని ఇబ్బందులకు గురి చేస్తుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ఈ క్రమంలో టాలీవుడ్ ఏపీకి తరలిపోతుందా అనే ప్రశ్నలు నిర్మాతలకు ఎదురవుతున్నాయి. నిజంగా టాలీవుడ్ హైదరాబాద్ ని వీడే పరిస్థితి ఉందా? ఒకవేళ నిజంగా టాలీవుడ్ ఏపీకి తరలిపోతే ఎవరికి నష్టం? అనే చర్చ మొదలైంది. హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద సినిమా హబ్ గా తయారైంది. సినిమా నిర్మాణానికి కావలసిన ఇంఫ్రాస్ట్రక్టర్, మ్యాన్ పవర్, స్టూడియోలు హైదరాబాద్ లో ఉన్నాయి. బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్ లో జరుగుతుంది.
ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ ఏపీకి వెళ్లినా ఇబ్బందులు తప్పవు. వైజాగ్ లో సినిమా నిర్మాణానికి అవసరమైన కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ అది సరిపోదు. హైదరాబాద్ పై ఆధారపడాల్సిందే. ఇప్పటికీ కొన్ని క్రాఫ్ట్స్ కి అవసరమైన సాంకేతికత కోసం చెన్నై మీద తెలుగు పరిశ్రమ ఆధారపడుతుంది. టాలీవుడ్ టాప్ హీరోలందరూ ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగినవారే. దర్శకులు, నిర్మాతలు, నటులలో కూడా 80 శాతం వారే. వీరి ఆస్తులు, నివాసాలు తెలంగాణలోనే ఉన్నాయి.
అవన్నీ వదిలి వైజాగ్ కి షిఫ్ట్ కావడం సాధ్యమేనా?. కాబట్టి తెలంగాణలో ప్రత్యేక చిత్ర పరిశ్రమ ఉద్యమం తీవ్ర రూపం దాల్చితే ఏపీకి చెందిన చిత్ర ప్రముఖులకు ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో తెలంగాణ గవర్నమెంట్ పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతుంది. వందల కోట్ల రూపాయల రెమ్యూనరేషన్స్ గా తీకుంటున్న హీరోలు ఆదాయపన్ను భారీగా చెల్లిస్తున్నారు. వారు కొనే ఆస్తులు, కార్లు, ఇతర లగ్జరీ వస్తువులపై పన్ను చెల్లిస్తున్నారు. వినోదపు పన్ను రూపంలో మరింత ఆదాయం తెలంగాణకు సమకూరుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుంది. హైదరాబాద్ బ్రాండ్ నేమ్ డ్యామేజ్ కావచ్చు…
Web Title: Special film industry demand if tollywood moves to andhra who will lose
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com