South Stars: ఒకప్పటి బుల్లితెర నటులు ప్రస్తుతం వెండితెరను ఏలేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ గా, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా, స్టార్ హీరోలుగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. చిన్న చిన్న పాత్రలతో, కార్యక్రమాలతో మొదలైన వాళ్ళ కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుంది. టెలివిజన్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి స్టార్స్ గా ఎదిగిన సౌత్ ఇండియా స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా భారీ ఫేమ్ తెచ్చుకుంది నయనతార. సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె రికార్డులకు ఎక్కారు. అయితే నయనతార కెరీర్ మొదలైంది ఒక టెలివిజన్ హోస్ట్ గా. ‘చమయం’ అనే మలయాళ టెలివిజన్ షోకి నయనతార హోస్ట్ గా చేస్తున్న సమయంలో ఆమెకు ‘మనస్సింకారే’ అనే మూవీ ఆఫర్ రావడం జరిగింది. అలా నటిగా మారిన నయనతారకు చంద్రముఖి, గజినీ, లక్ష్మి వంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి.
దేశం మెచ్చిన నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ తమిళ చిత్ర పరిశ్రమకు రాకముందు దూరదర్శన్ లో కన్నడ సీరియల్స్ లో నటించాడు. ఆయన నటించిన సీరియల్స్ బిసులు కుడురే, గుడ్డాడ భూత బుల్లితెరపై ప్రసారం అయ్యాయి. 1988లో ఓ కన్నడ చిత్రంతో ప్రకాష్ రాజ్ నటుడిగా మారారు.

దేశముదురు సినిమాతో హీరోయిన్ గా మారిన హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై కెరీర్ ప్రారంభించారు. ఆమె షకలక భూమ్ భూమ్, కరిష్మా కా కరిష్మా వంటి సీరియల్స్ ప్రాచుర్యం పొందాయి. తెలుగు తమిళ భాషల్లో హన్సిక టాప్ హీరోయిన్ హోదా దక్కించుకున్నారు.
కెజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న యష్ కెరీర్ మొదలైంది బుల్లితెరపైనే. యష్ ఈటీవీ కన్నడలో ప్రసారమైన నంద గోకుల సీరియల్ లో నటించారు. 2007లో విడుదలైన కన్నడ చిత్రం జంబాడ హుడిగి తో వెండితెర ఎంట్రీ ఇచ్చి.. స్టార్ గా ఎదిగాడు.
నటుడు మాధవన్ ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగు, తమిళ పరిశ్రమల్లో స్టార్ గా కొనసాగారు. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు చేస్తున్న మాధవన్ సినిమాల్లోకి రాకముందు అనేక హిందీ సీరియల్స్ లో నటించారు. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన మాధవన్ కి చెలి మూవీతో హీరోగా బ్రేక్ దక్కింది.

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కెరీర్ టెలివిజన్ డాన్స్ రియాలిటీ షోలతో ప్రారంభమైంది.తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోయిన్ గా మారింది. మలయాళ చిత్రం ప్రేమమ్ సాయి పల్లవిని హీరోయిన్ గా నిలబెట్టింది. తెలుగులో ఫిదా చిత్రంతో సాయి పల్లవి నిలదొక్కుకున్నారు.
Also Read: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే వారసుడు అతనేనా..?
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కెరీర్ మొదలైంది బుల్లితెర ద్వారానే. సన్ టీవీలో ప్రసారమైన తమిళ సీరియల్ పెన్ లో ఆయన నటించారు. అలాగే మరికొన్ని టీవీ సీరియల్స్ లో విజయ్ సేతుపతి నటించడం జరిగింది. ఇక వెండితెరపై అనేక చిన్న చిన్న పాత్రలు చేశాడు. 2010లో విజయ్ సేతుపతికి హీరోగా అవకాశం దక్కింది.
తమిళంలో స్టార్ హీరోగా ఎదుగుతున్నారు శివ కార్తికేయన్. ఆయన లేటెస్ట్ మూవీ డాక్టర్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. శివ కార్తికేయన్ కెరీర్ బుల్లితెరపై స్టాండప్ కమెడియన్ గా మొదలైంది. 2012లో విడుదలైన ‘మారిన’ మూవీతో హీరోగా అవకాశం దక్కింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి.
Also Read: ప్రపంచం మీదకు ప్రాణాలు తీసే మరో మహమ్మారి ‘డెల్టాక్రాన్’