South films dominating Bollywood: ఒకప్పుడు సౌత్ సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. బాలీవుడ్ ఇండస్ట్రీ డామినేషన్ కి తట్టుకోలేక మనవాళ్లు చేతులెత్తేసేవారు. మన సౌత్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా బాలీవుడ్ మాఫియా ఆ సినిమాలకు బాలీవుడ్ లో ఆదరణ లేకుండా తొక్కెసేవారు. అలాగే మన దర్శకులు ఎవరైనా బాలీవుడ్ వెళ్లి సినిమాలు చేసినా కూడా వాళ్లకు పెద్దగా గుర్తింపు రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మొత్తం మారిపోయింది… ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…కారణం ఏంటి అంటే మనవాళ్లు చేస్తున్న సినిమాలు, ఎంచుకుంటున్న కథలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.
హాలీవుడ్ లో మన వాళ్ళ క్రేజ్ ఎంతలా పెరిగిపోయింది అంటే బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ నటించిన ‘డంకి’ సినిమా, అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సలార్’ సినిమా రెండు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. అయినప్పటికి బాలీవుడ్ ప్రేక్షకులు షారుక్ ఖాన్ సినిమాను చూడకుండా ప్రభాస్ సినిమా చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు…
ఒకరకంగా చెప్పాలి అంటే బాలీవుడ్ ప్రేక్షకులు అక్కడి హీరోలను పట్టించుకోవడం లేదు. మన తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే మన స్టార్ హీరోలకు అభిమానులుగా మారిపోయారు… ప్రస్తుతం ఇండియాలో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ సినిమాలేంటో ఓలుక్కేద్దాం…
1.పుష్ప 2 – 294 కోట్లు
2. ఆర్ ఆర్ ఆర్ – 223 కోట్లు
3. బాహుబలి 2 – 217 కోట్లు
4. కల్కి – 191.50 కోట్లు
5. సలార్ – 178.50 కోట్లు
6.దేవర -172 కోట్లు
7.కెజిఎఫ్ 2 – 165 కోట్లు
8.ఓజీ – 154 కోట్లు
9.కూలీ – 153 కోట్లు
10 లియో -143 కోట్లు…
మొత్తానికి టాప్ టెన్ లో ఏడు తెలుగు సినిమాలు ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అలాగే ఇక టాప్ 5 లో కూడా వరుసగా మన సినిమాలే ఉన్నాయంటే మన ఇండస్ట్రీ స్థాయి ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు…