Telangana Collectors: సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. అతని ట్రాన్స్ఫర్ ను ప్రజలు స్వాగతించారు. సంబరాలు జరుపుకున్నారు. దీనిని బట్టి అతడి ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో ఈ జిల్లాలో కలెక్టర్ గా వచ్చినప్పుడు సందీప్ కుమార్ అప్పటి గులాబీ పార్టీ నేతలు అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అక్రమాలపై ఉక్కు పాదం మోపారు. దీంతో ఆయన గొప్ప అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
“ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నారు. కొంతమంది అధికారులతో గ్రూపును ఏర్పాటు చేసి లంచాలు వసూలు చేశారు. ప్రతి పనిలో 6% డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. చివరికి పశు సంవర్ధక శాఖ అధికారి నుంచి లక్ష రూపాయల విలువైన ముర్రా జాతి గేదెను తీసుకున్నారు. డబ్బులు ఇస్తానని ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఆ అధికారి లబోదిబో అంటున్నారు. ప్రజాప్రతినిధుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అందువల్లే ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన ఏకంగా బదిలీ చేశారు. ప్రాధాన్యం లేని పోస్టుకు పంపించారు. ఎంత వెలుగు అయితే వెలిగారో.. అంతే స్థాయిలో కిందికి పడిపోయారని” వెలుగు పత్రికలో సిరిసిల్ల కలెక్టర్ మీద కథనం వచ్చింది.
వాస్తవానికి ఒక కలెక్టర్ ఆరు శాతం కమిషన్ వసూలు చేయడం.. చివరికి ఒక గేదెను కూడా బహుమతిగా తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మొదట్లో కేటీఆర్ అనుచరులు చేసిన అక్రమాలపై ఉక్కు పాదం మోపిన ఈ కలెక్టర్ మీద ప్రశంసలు లభించాయి. సిరిసిల్ల ప్రజలు ఇతడికి బ్రహ్మరథం పట్టారు. కొంతకాలానికి ఎంతైతే మంచి పేరు సంపాదించుకున్నారో.. అంతే చెడ్డ పేరును తెచ్చుకున్నారు. ఈయన మాత్రమే కాకుండా మరొక కలెక్టర్ కూడా ఇలానే వ్యవహరిస్తున్నారట. ఆయన ఏకంగా భూ భారతి దరఖాస్తులకు డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారట. ప్రతి ఫైల్ కు ఒక రేటు గట్టి వసూలు చేస్తున్నారట. సీసీ ద్వారా ఈ వ్యవహారం సాగిస్తున్నారట. ఇతడి కూడా ఇంటలిజెన్స్ రహస్య నివేదికను ప్రభుత్వానికి అందించిందట. రేపో మాపో ఈ కలెక్టర్ కూడా బదిలీ అవుతారట. అన్నట్టు ఒక కలెక్టర్ బదిలీ అయితే టపాసులు కాల్చి సిరిసిల్ల వాసులు పండగ చేసుకున్నారు. ఇలాంటి దృశ్యం చూసైనా సరే ప్రభుత్వం సందీప్ కుమార్ ఝా ను అధికారిగా ఎలా కొనసాగిస్తోంది .. ఎలా ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తోంది.. ఈ ప్రశ్నలే సగటు తెలంగాణ వాదిని తొలుస్తున్నాయి.