
మంచి తనం, దాన గుణం మనిషికి అంత మంచిది కాదు. ఎదుటివాడి బాధను చూసి స్పదించి సాయాలు చేసి మనం బికారిగా మారితే ఆదుకునే నాథుడు ఉండక పోవచ్చు. చివరకు మనం సాయం చేసిన చేసినవాడే మనకు సాయం చేయక పోవచ్చు. భారతంలో దానం గుణం కలిగిన కర్ణుడికి కష్టాలు తప్పలేదు. కలియుగ కర్ణుడిగా పేరు గాంచిన సోనూ సూద్ పరిస్థితి కూడా భవిష్యత్ లో అలానే తయారయ్యేలా ఉంది. సోనూ సూద్ తనను సాయం కోరిన వారి బాధలు తీర్చడానికి తన ఆస్తులు తాకట్టు పెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Also Read: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో టాలెంటెడ్ కమెడియన్ కూడా కీలకమేనట !
పది కోట్ల రూపాయల నిధులు సేకరించడం కోసం సోనూ సూద్… ముంబైలోని దాదాపు ఎనిమిది చోట్ల ఉన్న ప్రాపర్టీని తనఖా పెట్టినట్లు సమాచారం. ముంబైలోని రెండు షాప్స్, ఆరు ఫ్లాట్లు సోనూ సూద్ తాకట్టు పెట్టాడట. సెప్టెంబర్ 15న దీనికి సంబంధించిన అగ్రిమెంట్ల పై సంతకంచేయగా, గత నెల 24న రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయినదట. దీనికి సాక్షిగా ఉన్న వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ హెడ్ రితేష్ మెహతా ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.
Also Read: ఇంగ్లీష్ సినిమాని కాపీ చేస్తోన్న సీనియర్ హీరో !
ముంబైలోని తన ఖరీదైన హోటల్ ని కోవిడ్ బాధితుల చికిత్స కోసం ఇచ్చిన సోనూ సూద్, వందల మంది వలస కార్మికులకు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి, తమ సొంత ఊరికి పంపించారు. దేశంలో ఎవరు తమ సమస్యను సోనూ సూద్ తో విన్న వించుకున్నా అడిగిందే తడవుగా సాయం చేశారు. ఇప్పటికే కోట్లలో నిరుపేదల సాయం కోసం సోనూ సూద్ ఖర్చు పెట్టారు. అత్తెసరు సంపాదనతో ఇంత మందికి సేవ చేయడం కష్టమైన పనే. అందుకే చివరకు సోనూ సూద్ తన ఆస్తులు తనఖా పెట్టినట్లు తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్