సోనూసూద్ భావోద్వేగం: రాళ్లేసిన వారే పూలు చల్లిన వేళ..

బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయని సామెత. పరిస్థితి ఒకేలా ఉండదు. ఒకసారి చీ కొట్టించుకున్న వారినే అక్కున చేర్చుకునే అవకాశం రావచ్చు. దానికి కృషి, పట్టుదల, దీక్ష, కసి కావాలి. ఎదగాలనే సంకల్పం ఉంటే ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అండలుంటే కొండలైనా దాటొచ్చంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని సినీనటుడు సోనూ సూద్ సాధించాడు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లు ఏ కంపెనీ అయితే తన ఫొటో రిజెక్టు చేసిందో అదే కంపెనీ కవర్ పేజీపై ఫొటో […]

Written By: Srinivas, Updated On : May 31, 2021 10:47 am
Follow us on

బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయని సామెత. పరిస్థితి ఒకేలా ఉండదు. ఒకసారి చీ కొట్టించుకున్న వారినే అక్కున చేర్చుకునే అవకాశం రావచ్చు. దానికి కృషి, పట్టుదల, దీక్ష, కసి కావాలి. ఎదగాలనే సంకల్పం ఉంటే ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అండలుంటే కొండలైనా దాటొచ్చంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని సినీనటుడు సోనూ సూద్ సాధించాడు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లు ఏ కంపెనీ అయితే తన ఫొటో రిజెక్టు చేసిందో అదే కంపెనీ కవర్ పేజీపై ఫొటో రావడం సామాన్యమైన విషయం కాదు.

స్టార్ డస్ట్ మ్యాగజైన్ కోసం ఓసారి సోనూసూద్ తన ఫొటో పంపాడు. అయితే అడిషన్ చేసిన కంపెనీ రిజెక్టు చేసింది. అయినా సోనూసూద్ కుంగిపోలేదు. తనలోని కసిని మరింత పెంచుకుని జీవితంలో ఎదుగుతూ చూపించాడు. దినదిన ప్రవర్తమానంగా ఎదిగే క్రమంలో ప్రస్తుతం ఆయన ఫొటోను సదరు పత్రిక కవర్ ఫొటోగా ప్రచురించింది. దీంతో సోనూసూద్ సంతోషం వ్యక్తం చేశాడు. ఒకప్పుడు రిజెక్టు చేసిన కంపెనీయే ఇప్పుడు పబ్లిష్ చేయడం ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. తన ఫొటోను కవర్ పిక్ గా వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

కరోనా మహమ్మారి ప్రభావంతో బాధపడుతున్న బాధితుల కోసం సోనూసూద్ నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మందులు, ఆక్సిజన్ కోసం ప్రతినిత్యం శ్రమిస్తున్నారు. ఆపదలో ఉన్నవారి కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు. ఏ నాయకుడికి లేని సామాజిక సేవ ఆయనలో కనిపిస్తుంది. కేవలం ఓట్ల కోసం అడుక్కునే నాయకులున్న దేశంలో సోనూసూద్ లాంటి వారు ఉండడం విశేషం.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్, బెడ్లు, మెడిసిన్ కావాలని ఫోన్లు వస్తూనే ఉంటాయి. వారందరికీ సదుపాయాలు ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో ఓపిక ఉండాలి. గత నెలలో ఆయన ఫో న్ కు ఆగకుండా వస్తున్న వీడియోలను ట్వీట్ చేశారు. ప్రజలకు సేవచేయడంలోనే అసలైన సంతృప్తి ఉందని చెబుతున్నారు. వారికి సాయం చేయడమంటే వంద కో ట్ల సినిమా చేస్తున్నంత సంతోషంగా ఉంటుందని చెప్పారు.