సోనూసూద్‌కు మరో అరుదైన గౌరవం

ఎక్కడ సమస్య ఉందో.. అక్కడ క్షణాల్లో వాలిపోతాడు సోనూసూద్‌. సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సోనూసూద్ చేసిన.. చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. సోనూసూద్‌ ఇప్పుడు సాయానికి మారుపేరులా మారిపోయాడు. ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి సాయం అందిస్తున్నాడు. వలస కార్మికులను వారి ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక […]

Written By: NARESH, Updated On : November 2, 2020 2:03 pm
Follow us on

ఎక్కడ సమస్య ఉందో.. అక్కడ క్షణాల్లో వాలిపోతాడు సోనూసూద్‌. సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సోనూసూద్ చేసిన.. చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. సోనూసూద్‌ ఇప్పుడు సాయానికి మారుపేరులా మారిపోయాడు. ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి సాయం అందిస్తున్నాడు. వలస కార్మికులను వారి ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్‌ కొనిచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సాయాలు చేస్తున్నాడు. ఇటీవల ఓ విలేజీలో ఏకంగా సెల్‌ టవర్‌‌ వేయించాడు. దీంతో ఆయనకు సేవలకు ఓ గుర్తింపు లభించింది.

లాక్‌డౌన్‌లో వలస కూలీలకు బాసటగా నిలవడంతోపాటు అనేకమంది పేదలకు ఆర్థిక సాయం అందించిన సినీ నటుడు సోనూసూద్‌ను డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌(యూఎస్‌ఏ) ప్రత్యేక పురస్కారంతో సత్కరించనుంది. అలాగే.. పలు విభాగాల్లో సేవలందించిన వారికి కూడా సత్కరించనుంది. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత అంశాల్లో విశేష సేవలందిస్తున్న నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులును విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ ధర్మప్రచారక్‌ తెలిపారు.

ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ ఆఫీషియల్స్‌ కమిటీ డిప్యూటీ చైర్మన్‌ వేమూరి సుధాకర్‌, ద్వారకామయి ట్రస్ట్‌ ద్వారా పేదలు, వృద్ధులకు సేవలందిస్తున్న బండ్లమూడి శ్రీనివాస్‌, తన మాటలతో వినోదాన్ని అందించడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యాఖ్యాత కనకాల సుమలకు విశేష పురస్కారాలు అందించనున్నారు.

విశిష్ట, ప్రత్యేక పురస్కారాల విజేతలకు రూ.2 లక్షలు, విశేష పురస్కార విజేతలకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. అయితే తనకు అందించనున్న నగదు బహుమతిని హైదరాబాద్‌లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడి శస్త్ర చికిత్సకు అందించాలని సోనూసూద్‌ సూచించినట్లు సమాచారం. ఈ పురస్కారాలను డిసెంబరు లేదా జనవరిలో ప్రదానం చేయనున్నారు.