సినీ నటుడు సోనూసూద్ సినిమాల్లోనే కాదు నిజజీవితంలో హీరోనే. సినిమాల్లో ప్రతినాయకుడి వేషాలు వేసినా బాహ్య ప్రపంచంలో మాత్రం తనదైన శైలిలో సాయం అందజేస్తున్నాడు. కరోనా మొదటి, రెండు దశల్లో ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. తన సత్తా ఉన్నంత వరకు సేవ చేస్తానని చెప్పడం ఆయనలోని మంచితనం. మంచితనానికే అంబాసిడర్ గా సోనూసూద్ సామాజిక సేవలో తరిస్తున్నాడు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ తనలోని దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు.
కేరళలో సిగ్నల్ కు దూరంగా ఉంటున్న విద్యార్థుల కోసం సెల్ టవర్ నిర్మాణం చేయడం ఆయనలోని నైతికతకు అద్దం పడుతోంది. విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించి వారి బాధలు తీర్చే క్రమంలో వారికి సెల్ టవర్ నిర్మాణం చేయడం అంటే మాటలు కాదు. సెల్ టవర్ నిర్మాణానికి పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుందని తెలిసినా ఆయన వెనకకు పోలేదు. వారి బాగోగులే తమ అభ్యుదయంగా భావించి వారిని ఉన్నతులుగా చేయాలని చూడడం గమనార్హం.
ప్రజల కోసం నిరంతరం ఆలోచించే సోనూసూద్ తాజాగా ట్విటర్ లో రోటీలు చేస్తూ వీడియోను పోస్టు చేశాడు. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సోనూసూద్ రొట్టెలు చేయడమేమిటని ముక్కున వేలేసుకున్నారు. చిరు వ్యాపారుల కోసం సోనూసూద్ చేస్తున్న ప్రచారాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. వారి బాగోగుల కోసం తపించే సోనూసూద్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు.
సోనూసూద్ నటుడిగానే కాక సామాజిక సేవకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఆపదలో ఉన్న వారిని రక్షించే క్రమంలో ఎంత మేరకైనా కష్టపడతాడు. వారిలో విశ్వాసాన్ని పెంచుకుని తన సేవలను విస్తరించుకుంటున్నాడు. ప్రాంతమేదైనా సాయం చేయడానికే ప్రాధాన్య మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని స్టేట్లలో అభిమానుల్ని సంపాదించుకుని రియల్ హీరో అయిపోయాడు.