https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: సీక్రెట్ రూమ్ లోకి సోనియా..ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం..4 వారాలకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే!

ఒక అమ్మాయి ఇలా ఎలా మాట్లాడగలదు అంటూ మండిపడ్డారు ఆడియన్స్. అంతే కాకుండా నిఖిల్, పృథ్వీ ని పెద్దోడు, చిన్నోడు అంటూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వెయ్యడాన్ని గమనించిన ప్రేక్షకులు విసుగెత్తిపోయారు. టాస్కులు అద్భుతంగా ఆడి టైటిల్ కొట్టేంత సత్తా ఉన్నటువంటి నిఖిల్, పృథ్వీ లను తన గుప్పిట్లో పెట్టుకొని ఈమె ఆడిస్తున్న ఆటలు చూసి ఈమె తొందరగా వెళ్ళిపోతే బాగుణ్ణు, నామినేషన్స్ లో రావాలి అని ఆడియన్స్ కోరుకునేవారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 28, 2024 / 05:26 PM IST

    Bigg Boss 8 Telugu(57)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో పాటుగా బయట ప్రేక్షకులకు కూడా బాగా కోపం, చిరాకు రప్పించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియానే. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు ఆమె అందం, మాట తీరుని చూసి కచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈమె మాటలు జారే తీరుని చూసి ప్రతీ ఒక్కరికి చిరాకు కలిగింది. ఒక అమ్మాయి ఇలా ఎలా మాట్లాడగలదు అంటూ మండిపడ్డారు ఆడియన్స్. అంతే కాకుండా నిఖిల్, పృథ్వీ ని పెద్దోడు, చిన్నోడు అంటూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వెయ్యడాన్ని గమనించిన ప్రేక్షకులు విసుగెత్తిపోయారు. టాస్కులు అద్భుతంగా ఆడి టైటిల్ కొట్టేంత సత్తా ఉన్నటువంటి నిఖిల్, పృథ్వీ లను తన గుప్పిట్లో పెట్టుకొని ఈమె ఆడిస్తున్న ఆటలు చూసి ఈమె తొందరగా వెళ్ళిపోతే బాగుణ్ణు, నామినేషన్స్ లో రావాలి అని ఆడియన్స్ కోరుకునేవారు.

    వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే ఈమె నామినేషన్స్ లోకి వచ్చింది. ఓటింగ్ ప్రకారం అందరికంటే అతి తక్కువ ఓట్లు వచ్చింది ఈమెకే. ఈమెకు ముందు ఆదిత్య ఓం ఉన్నాడు. కానీ సోనియా బిగ్ బాస్ టీం కోరుకున్న కంటెంట్ ని కావాల్సినంత ఇస్తుందట. అంతే కాకుండా హౌస్ లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా సోనియా గురించే ఉంటుంది. హౌస్ లో జరిగే కీలక పరిణామాలు ఆమె చుట్టూనే తిరుగుతుండడం వల్ల ఆమెని ఎలిమినేట్ చేయకుండా, ఆదిత్య ఓం ని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నారట. ఎందుకంటే ఆదిత్య నుండి ఎలాంటి కంటెంట్ రావడం లేదు, టాస్కులు కూడా ఆయన ఆడలేకపోతున్నాడు. ఇవి రెండు పక్కన పెడితే వారానికి ఆయనకీ 4 లక్షల 50 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఇంత రెమ్యూనరేషన్ ఆయనకీ వృధా అని బిగ్ బాస్ టీం అనుకుంటుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లాగా బిల్డప్ ఇచ్చి సోనియా ని సీక్రెట్ రూమ్ లోకి పంపి, ఆదిత్య ని బయటకి పంపబోతున్నారని టాక్. కానీ ఆదిత్య కి, సోనియా కి ఓటింగ్ లో చిన్న తేడా లేదు.

    ఇద్దరి మధ్య చాలా తేడానే ఉంది, అందుకే ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారట. సోనియా ని ఎలిమినేట్ చేసి వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా రీ ఎంట్రీ ఇప్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారట టీం. అయితే సీక్రెట్ రూమ్ ని మాత్రం సిదాం చేసినట్టు తెలుస్తుంది. నూటికి 99 శాతం ఆమెని సీక్రెట్ రూమ్ లోకి పంపించి, ఆదిత్య ని ఎలిమినేట్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయట. సోనియా ని ఒకవేళ సీక్రెట్ రూమ్ లోకి పంపితే ఆమె గురించి హౌస్ లో చాలా చర్చలు నడుస్తుంది. ముఖ్యంగా నిఖిల్, పృథ్వీ ఆమె గురించి ఏమి అనుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. అవన్నీ చూసిన తర్వాత ఈమె హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తే కంటెంట్ అదిరిపోతోంది అనే ఆలోచనలో ఉన్నారట టీం, మరి ఏమి జరగబోతుందో చూడాలి.