Sonam Bajwa: రంగుల ప్రపంచంలా కనిపించే సినీ పరిశ్రమలోకి రావాలని చాలా మంది విపరీతంగా ట్రై చేస్తారు. కానీ ఇందులోకి ఎంట్రీ ఇచ్చాక తెలుస్తుంది కష్టపడందే ఏదీ రాదని.. కెమెరా ముందు నటించడం తేలికే అని చాలా మంది భావిస్తారు. కానీ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడానికి కొన్నింటిని వదులుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ గా రాణించాలంటే అందం, అభినయంతో కనిపించడంతో పాటు గ్లామర్ షో చేయాలి. ఈ మధ్య కొన్ని సినిమాల్లో ముద్దు సీన్లను తప్పనిసరి చేస్తున్నారు. దీంతో కొందరు నటిగా రాణించడం కోసం ముద్దు సీన్లకు ఓకె చెబుతున్నారు. కొందరు హీరోయిన్లు మాత్రం ససెమిరా అంటున్నారు. అలా ఓ హాట్ భామ ముద్దు సీన్లో నటించమంటే అస్సలు ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఏకంగా ఇండస్ట్రీనే వద్దనుకుంది.
ఇప్పుడొస్తున్న సినిమాలో లిప్ టు లిప్ ఉన్నా పెద్దగా పట్టించుకోవడ లేదు. ఇంకాస్త రొమాన్స్ ఉంటే బావుండు.. అని కొందరు కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడంతో పాటు అవకాశాలు దక్కించుకోవడానికి కొంతమంది హీరోయిన్లు అడ్డూ అదుపు లేకుండా విచ్చల విడిగా ముద్దు సీన్లనో నటిస్తున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ముద్దు సీన్లో నటించమంటే వద్దని చెప్పిందట. తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో మెరిసింది సోనమ్ బజ్వా. ఆ తరువాత హిందీ సినిమాల్లో నటించిందీ భామ.
ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలకు ఫోజులిచ్చి వాటిని రిలీజ్ చేసింది. ఇందులో సోనమ్ బజ్వాను చూస్తే ఎవరైనా హాట్ హీరోయిన్ అని అనుకుంటారు. కానీ తన డ్రెస్సింగ్ అలా ఉన్నా.. మనసులో మాత్రం వేరే ఉద్దేశమని అంటోంది. గ్లామర్ చూపించడం వరకు మాత్రమేనని.. అలాగనే మరీ హద్దులు దాటాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ క్రమంలో ఆమె ఓ సినిమా కోసం ముద్దు సీన్లోనటించమని అడిగితే వద్దని సినిమాలో నటించడం మానేసిందట.
తెలుగులో వెంకటేశ్ తో ‘బాబు బంగారం’ అనే సినిమాలో ప్రత్యేక సాంగ్ లో మెరిసిందీ భామ. ఆ తరువాత ఆటాడుకుందాం రా.. అనే సినిమాలో కనిపించింది. అయితే తెలుగులో అవకాశాలు రాకపోవడంతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టింది. అక్కడా ఈమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అవకాశాల్లేక ఖాళీగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తూ కొన్ని విషయాలను ఆడియన్స్ తో పంచుకుంది. ఈ సందర్భంగా తన ముద్దు ముచ్చట గురించి ఓపెన్ అయింది.