Sonakshi Sinha: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సోనాక్షి సిన్హా…ఆమె తన కెరియర్ లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలను చేసింది. ప్రస్తుతం ఆమె వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న ‘జటాధర’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో చాలా వరకు తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. టాలీవుడ్ ను చూసి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని చెప్పింది… చాలా సంవత్సరాల క్రితం తమిళంలో లింగా అనే సినిమా చేశానని ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ కి జటాధర సినిమాలో నటిస్తున్నానని ఆవిడ చెప్పారు. ఇక దాంతో పాటుగా ప్రాంతీయ సినిమాల మీద తనకు ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పారు.
అలాగే బాలీవుడ్ సైతం ప్రస్తుతం టాలీవుడ్ ను చూసి కొన్ని విషయాల్లో నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉందని చెప్పింది. ముఖ్యంగా టాలీవుడ్ లో 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే షూటింగ్ లను నిర్వహిస్తారు. ఇలా చేయాలి అంటే ఎంతో క్రమ శిక్షణ ఉండాలి. టాప్ హీరోలందరు కూడా అదే టైమ్ కి వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే దానికి చాలా క్రమశిక్షణ ఉండాలి.
వాళ్ళందరూ ఏకతాటి పైన నడుస్తున్నారు కాబట్టే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. కానీ బాలీవుడ్ లో మాత్రం అలా లేదు షూటింగ్ మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేసి అర్ధరాత్రి వరకు తీస్తూనే ఉంటారని ఆ విషయాల్లో ఆర్టిస్టులందరికి చాలావరకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని చెప్పారు.
మొత్తానికైతే సోనాక్షి సిన్హా సినిమా బాలీవుడ్ మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్ జనాలను కొంతవరకు ఇబ్బందులకు గురిచేస్తుందనే చెప్పాలి. కానీ టాలీవుడ్ మీద ఆమె తన ప్రేమను తెలియజేయడం అనేది ప్రతి ఒక్కరు ఆనందపడేలా చేస్తోంది… జటాధర మూవీ లో ఆమె విలన్ పాత్రను పోషిస్తోంది. ఈ మూవీ ఈనెల 7 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది…