Peddi Chikiri Song Review గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) నుండి నేడు ‘చికిరి’ సాంగ్ విడుదలైంది. AR రెహమాన్ స్వరపర్చిన ఈ పాట విడుదలకు ముందు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గా ఉండేవి. ఎందుకంటే చాలాకాలం తర్వాత AR రెహమాన్ పనిచేస్తున్న తెలుగు చిత్రం, అందులోనూ బుచ్చి బాబు కి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందని ఉప్పెన చిత్రం తో నిరూపణ అయ్యింది కాబట్టి, రెహమాన్ చేత అద్భుతమైన బాణీలు చేయించుకుంటాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమో కి ఫ్యాన్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. హీరోయిన్ ని టీజ్ చేసే సాంగ్ అన్నారని, వింటేజ్ రామ్ చరణ్ సినిమాల్లోని పాట లాగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సాంగ్ అలా లేదు. ట్యూన్ లో ఎక్కడో ఎనర్జీ మిస్ అయ్యినట్టుగా అనిపించింది.
AR రెహమాన్ మ్యూజిక్ అంటే ఆయన స్టైల్ ట్యూన్ మనం చాలా తేలికగా కనిపెట్టేయగలం. ఒక డిఫరెంట్ మోడ్ లో ఉంటుంది. కానీ ట్యూన్ వింటుంటే నిజంగా AR రెహమాన్ కంపోజ్ చేశాడా? అని అనిపిస్తోంది. ఒక సందర్భం లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ రెహమాన్ సొంతంగా ట్యూన్స్ ఈమధ్య చేయడం లేదు, వేరే వాళ్ళతో చేయిస్తున్నాడు, అందుకే నేను అతన్ని తీసుకోలేదు అని అన్నాడు. ఈ ట్యూన్ వింటుంటే ఇది కూడా రెహమాన్ వేరే వాళ్ళతో చేయించాడా అనే అనుమానం కలుగుతోంది.
ఇక నోట్లో బీడీ పట్టుకొని, క్రిందకు కూర్చొని రామ్ చరణ్ వేసిన స్టెప్పు కూడా అనుకున్నంతగా పేలలేదు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఎందుకో ఈమధ్య రామ్ చరణ్ తో జానీ మాస్టర్ జోడీ సరిగా కుదరడం లేదు. ఒకప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ పాట ఇండస్ట్రీ ని షేక్ చేసేది. కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ మిస్ అవుతోంది. గేమ్ చేంజర్ చిత్రం లో రెండు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేసాడు జానీ మాస్టర్. కానీ ఆ పాటల్లోని స్టెప్పులు కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. నేడు విడుదల చేసిన ‘చికిరి’ పాట ప్రోమో లో కూడా చరణ్ స్టెప్పులు అంతగా అనిపించలేదు. బహుశా జానీ మాస్టర్ ఈ మధ్య అరెస్ట్ అయ్యి, చాలా కాలం జైలు జీవితం గడిపి రావడం వల్ల, ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ లో కాస్త జాప్యం జరిగి ఉండొచ్చు, అందుకే ఒకప్పటి రేంజ్ లో స్టెప్పులను కంపోజ్ చేయలేకపోతున్నాడని విశ్లేషకుల అభిప్రాయం.
ఇక ఈ పాటలో ‘చికిరి’ అనే దానికి అర్థం ఏమిటంటే, ఇందులో హీరో ఉంటున్న గ్రామం లో అమ్మాయిలను చికిరి అని పిలుస్తారట. అలా రామ్ చరణ్ హీరోయిన్ ని చూసిన మొదటిసారి ఆయన నుండి వచ్చే పాట ఇది అని డైరెక్టర్ బుచ్చి బాబు వీడియో లో రహమాన్ కి వర్ణిస్తూ ఉంటాడు. ప్రోమో అయితే అనుకున్న రేంజ్ లో క్లిక్ అవ్వలేదు, మరి పూర్తి పాట అయినా అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి. సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చిన ఈ పాట ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
What is #CHIKIRI?@BuchiBabuSana & @arrahman garu reveal it & don't miss the surprise at the end
▶️ https://t.co/nbcgt8O9b0#ChikiriChikiri
An @arrahman musical
Sung by @_MohitChauhan ️Full song on NOV 7th.#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/PllFymKEl4
— Ram Charan (@AlwaysRamCharan) November 5, 2025