Chhaava Trailer
Chhaava Trailer : బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలు నుంచి స్టార్ హీరోల సినిమాలేవి పెద్దగా ప్రభంజనం అయితే సృష్టించడం లేదు. ఇక ఇప్పుడు ఛత్రపతి శివాజీ కొడుకు అయిన ఛత్రపతి శంబాజీ మహరాజ్ (Chatrapathi Shambaaji Mharaj) జీవిత కథ ఆధారంగా ‘చావా’ (Chaava) అనే సినిమాని తెరకెక్కించారు. ఇక లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ ట్రైలర్ ని గత కొద్దిసేపటికి క్రితమే రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదటినుంచి చివరి వరకు చాలా ఎమోషనల్ డైలాగులతో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన సన్నివేశాలు కూడా ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేస్తూ సినిమా ఉండబోతుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. శంబాజీ మహారాజ్ జీవిత కథ ఏ విధంగా ఉండబోతుంది. ఆయన ఎలాంటి రాజ్యాలను గెలిచాడు. ఎంతమంది ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు అనే కథాంశం తో ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఆయన జీవిత కథ చదువుతున్నప్పుడే ప్రతి ఒక్కరికి ఒళ్ళుగగ్గురు పొడిచే ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇక విజువల్ గా ఈ సినిమాని స్క్రీన్ మీద చూడటానికి యావత్ ఇండియన్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాని దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా శంబాజీ మహారాజ్ క్యారెక్టర్ లో నటించిన విక్కీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని చూపించినట్టుగా తెలుస్తోంది…
ముఖ్యంగా కొన్ని కొన్ని సీక్వెన్స్ యాక్షన్స్ బాహుబలి సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను గుర్తు చేసినప్పటికి వాటిలో ఒక మంచి డ్రామాను కూడా క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది…కావాలనే వాళ్ళు బాహుబలి సినిమాలా యాక్షన్ ను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది… మరి ఈ సినిమాతో అయిన బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సాధించి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునెలా చేస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక చావా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ ట్రైలర్ అయితే చాలా వరకు ప్రతి ఎమోషన్ ని క్యారీ చేస్తూ చాలా ఇంపాక్ట్ ను ఇచ్చే విధంగా ఉందనే కామెంట్లు కూడా వెలువడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో విక్కీ కౌశల్ ఉత్తమ నటుడిగా ‘నేషనల్ అవార్డు'(National Award) ను కూడా గెలుచుకోబోతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి…
ఇక ట్రైలర్ లో వాడిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆ సిచువేషన్ ని భారీగా ఎలివేట్ చేసే విధంగా అయితే ఉన్నాయి. ఇక ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాను తొందరగా చూడాలి అనే ఒక క్యూరియాసిటీ ని తెప్పిస్తుంది. మరి సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమా భవితవ్యం ఏంటి అనేది తెలియదు…