https://oktelugu.com/

‘సోలో బ్రతుకే’ మిగిలిన సినిమాలకు మార్గదర్శి !

కరోనా ప్రళయం తరువాత ఎట్టకేలకు ఈ నెలలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని థియేటర్లు, మల్టిప్లెక్స్ స్క్రీన్ లు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికే ఏఎంబీ మాల్ డిసెంబర్ 4న స్టార్ట్ అవ్వడానికి ఆల్ రెడీ బుకింగ్స్ ను ఓపెన్ చేసేసుకుంది. అలాగే సింగల్ థియేటర్లు కూడా అతి త్వరలోనే ఓపెన్ అవుతాయని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్లుగానే చిన్నాచితకా సినిమాలను రెడీ చేసే పనిలో పడ్డారు మేకర్స్. Also Read: పాపం డబ్బులు కోసం […]

Written By:
  • admin
  • , Updated On : December 1, 2020 / 07:42 PM IST
    Follow us on


    కరోనా ప్రళయం తరువాత ఎట్టకేలకు ఈ నెలలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని థియేటర్లు, మల్టిప్లెక్స్ స్క్రీన్ లు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికే ఏఎంబీ మాల్ డిసెంబర్ 4న స్టార్ట్ అవ్వడానికి ఆల్ రెడీ బుకింగ్స్ ను ఓపెన్ చేసేసుకుంది. అలాగే సింగల్ థియేటర్లు కూడా అతి త్వరలోనే ఓపెన్ అవుతాయని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్లుగానే చిన్నాచితకా సినిమాలను రెడీ చేసే పనిలో పడ్డారు మేకర్స్.

    Also Read: పాపం డబ్బులు కోసం ‘వేదిక’ మరి ఇంతగా !

    అయితే, థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి, సినిమాలు రిలీజ్ అవుతాయి… అంతా బాగానే ఉంది గానీ, అసలు జనం థియేటర్లకు వస్తారా ? రావాలంటే ఒక స్టార్ హీరో నటించిన కొత్త సినిమా ఒకటి భారీ స్థాయిలో రిలీజ్ అవ్వాలి. అప్పుడే థియేటర్లు తెరుచుకున్నందుకు ఒక ఊపు ఉంటుంది, స్టార్ హీరోల అభిమానులు పెద్ద ఎత్తులో థియేటర్లకు వస్తారనే అంచనా ఉంటుంది. అలా కాకుండా ఈ లాక్ డౌన్ లో ఓటిటీలో రిలీజ్ అయిన సినిమాలను తీసుకువచ్చి మళ్ళీ థియేటర్లల్లో ప్రదర్శిస్తే జనం అసలు ఆసక్తి చూపరు. మరి ఈ విషయం తెలిసి కూడా కొంతమంది మేకర్స్, తమ సినిమాని మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయాలని తెగ ఆశ పడుతున్నారు.

    Also Read: డిసెంబర్ 15 నుండి రాజకీయ సన్నివేశాల్లో ‘మహేష్’ !

    వారి ఆశకు ఎలాగూ పైసలు రాలవు, దానికితోడు రానున్న కొత్త సినిమాలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక, ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు సాయి తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా వైపే చూస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లోకి వస్తుండటంతో ఈ సినిమా రెవిన్యూ పై అందరి కన్ను ఉంది. అసలు ఈ సినిమాని చూసేందుకు జనం ఏ స్థాయిలో వస్తారు ? వస్తేనే .. మిగతా సినిమాలన్నీ సంక్రాంతికి డేట్స్ లాక్ చేసుకుంటాయి, లేదంటే మళ్ళీ సినిమాలు పోస్ట్ ఫోన్ చేసుకోకతప్పదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్