
గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్లకి డబ్బులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం హింసిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. అసెంబ్లీ ముగిసిన అనంతరం వెలుపల మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. అధికార పార్టీ మాయమాటలు చెబుతోందన్నారు. ఎదురుదాడి చేస్తూ తమ నోరు మూయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.