Sohail : బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ సక్సెస్. ఆ సీజన్ భారీ టీఆర్పీ రాబట్టింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కఠిన నియమాల మధ్య హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించారు. షోకి ముందు రెండు వారాలు క్వారంటైన్ చేయాలనే నిబంధన పెట్టారు. దాని వలన పేరున్న సెలెబ్స్ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. పెద్దగా పరిచయం లేని ముఖాలు కంటెస్ట్ చేశారు. వారిలో సోహైల్ ఒకడు. సోహైల్ షోలో రాణించాడు. ఫైనలిస్ట్స్ లో ఒకరిగా నిలిచాడు. ఫినాలేలో సోహైల్ డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు.
బిగ్ బాస్ షో క్రేజ్ సోహైల్ కి హీరోగా అవకాశాలు తెచ్చిపెట్టింది. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బ్యూటీ కట్ బాలరాజు ఇలా వరుసగా చిత్రాలు చేశాడు. అయితే ఒక్క చిత్రం కూడా సోహైల్ కి బ్రేక్ ఇవ్వలేదు. నా సినిమాలు చూడండి అని కన్నీరు పెట్టి వేడుకున్నా ప్రేక్షకులు కనికరించలేదు. ప్రస్తుతం సోహైల్ కి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిగ్ బాస్ షోని ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశాడు.
Also Read : బిగ్ బాస్ 9 హోస్ట్ గా విజయ్ దేవరకొండ.. తన ఒపీనియన్ చెప్పిన రౌడీ హీరో!
బిగ్ బాస్ షోకి నేను జీరోగా వెళ్ళాను. బయటకు వచ్చాక క్రేజ్ చూసి నాకు బలుపు పెరిగింది. నోరు జారాను. లక్కీ లక్ష్మణ్ ఈవెంట్లో బూతులు తిట్టి వార్నింగ్ ఇచ్చాను. నేను తప్పులు చేశాను. ఇదంతా చేయడానికి నా పక్కన వాళ్ళు కూడా కారణం. వారు చెప్పడం వలనే నేను అలా చేశాను. నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. బిగ్ బాస్ షో వలన నాకు మంచి జరిగింది. అలాగే చెడు కూడా జరిగింది. జీవితంలో ఎలా గెలవాలో ఆ షో నేర్పింది. సీజన్ 4 చాలా సక్సెస్ అయ్యింది. ఆ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ కష్టపడ్డారు. తాము నిజ జీవితంలో ఎలా ఉంటామో అలానే గేమ్ ఆడాము.. అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. తన కెరీర్లో మిస్టర్ ప్రెగ్నెంట్ మైలురాయి లాంటి చిత్రం అని, కాకపోతే దానికి రావాల్సినంత గుర్తింపు రాలేదని నిరాశ వ్యక్తం చేశాడు. మేల్ ప్రెగ్నెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మొదటి సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. అమ్మతనం గొప్పతనం కూడా చక్కగా చెప్పాము. చెన్నై ఎయిర్ పోర్ట్ లో నన్ను కొందరు చూసి గుర్తుపట్టారు. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చూశామని, తమకు బాగా నచ్చిందని చెప్పడంతో ఆనందపడ్డానని సోహైల్ సంతోషం వ్యక్తం చేశాడు.
Also Read : బిగ్ బాస్ తెలుగు 9, కన్ఫర్మ్ అయిన ఫస్ట్ 6 కంటెస్టెంట్స్ వీరే? ఇక హౌస్లో రచ్చే