Radhe Shyam: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ రిలీజ్ కు రోజులు దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. కాగా తాజాగా ఈ మూవీ నుంచి ఓ డార్లింగ్ అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చింది చిత్ర బృందం.
“రాధేశ్యామ్ సినిమా నుంచి హిందీలో సెకండ్ సింగిల్ ‘సోచ్ లియా’ సాంగ్ టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ల మధ్య ఎమోషనల్ సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ గా సాగుతున్న ఈ సాంగ్ టీజర్ చూస్తుంటే ప్రేరణ, విక్రమాదిత్య మధ్య ఏదో అంతరం పెరిగినట్టు అన్పిస్తోంది. ఇక డిసెంబర్ 8న ఫుల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
When the heart breaks, it sings a song of its own. Second Hindi Single #SochLiya Teaser out now, Song out on 8th December.https://t.co/0fL7L29nyv#MusicalOfAges #RadheShyam@Mithoon11, @arijitsingh & @manojmuntashir
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/T67CJfvtey
— UV Creations (@UV_Creations) December 6, 2021
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Soch liya song promo out from prabhas radhe shyam movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com