Sobhita Dhulipala : తెలుగు రాష్ట్రాల నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అంత తేలికైన విషయం కాదు. చాలా తక్కువ తెలుగు అమ్మాయిలు మాత్రమే మన సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యారు. ఆ తక్కువ మందిలో ఒకరు శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala). వైజాగ్ ప్రాంతానికి చెందిన ఈమె మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న తర్వాత మన టాలీవుడ్ లోకి ‘గూడాచారి’ అనే చిత్రం ద్వారా ఆమె ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యినప్పటికీ ఆమె తెలుగు లో కొనసాగలేదు. హిందీ లో సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉండేది. ఇకపోతే రీసెంట్ గా ఈమె అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట చూసేందుకు ఎంతో క్యూట్ గా ఉంది.
అయితే సినిమాల్లోకి రాకముందు శోభిత ఒక హీరో సినిమా విడుదలైతే కచ్చితంగా మొదటి రోజు మొదటి ఆటని థియేటర్ కి వెళ్లి చూసేడట. ఆ హీరో మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan). అప్పటికీ ఇప్పటికీ ఈమె పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని గానే కొనసాగుతూ వచ్చింది. మరో పక్క నాగ చైతన్య మహేష్ బాబు(Super Star Mahesh Babu) ఫ్యాన్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య ఏ రేంజ్ గొడవలు తిరుగుతూ వస్తున్నాయో మనంత చూస్తూనే ఉన్నాము. దశాబ్ద కాలంగా ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పడంతో, మహేష్ ఫ్యాన్ అయిన నాగ చైతన్య తో శోభిత ఎప్పుడైనా గొడవ పడిందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫన్నీ గా ట్యాగ్ చేసి ట్వీట్స్ వేస్తున్నారు. ఇకపోతే శోభిత ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. భవిషత్తులో రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.