Naga Chaitanya- Sobhita Dhulipala: నాగచైతన్య భార్య సమంతకు దూరమై రెండేళ్లు కావస్తుంది. ఈ క్రమంలో హీరోయిన్ శోభిత దూళిపాళ్ళకు దగ్గరయ్యాడనే ప్రచారం జరిగింది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకున్న ఇంటికి తరచుగా శోభితను తీసుకెళ్లేవాడట. నాగ చైతన్య-శోభిత ఎఫైర్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. నాగ చైతన్య టీమ్ ఈ వార్తలను ఖండించారు. ఎవరో కావాలని చేస్తున్న ప్రచారమంటూ వివరణ ఇచ్చారు. అయితే లండన్ లో ఈ జంట విహరిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. నాగ చైతన్య, శోభిత ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. వీరు కలిసి ఉన్న ఫోటోలు అనుకోకుండా బహిర్గతం అయ్యాయి.
అప్పటికి కూడా శోభిత, నాగ చైతన్య తమ రిలేషన్ ఒప్పుకోలేదు. ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో శోభిత నాగ చైతన్యను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాగ చైతన్య గురించి చెప్పాలని శోభితను అడగ్గా… చైతూ చాలా మర్యాదస్తుడు. హుందాగా ఉంటాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్ గా ఉంటాడు. అతనిలో నాకు నచ్చింది అదే అన్నారు. నాగ చైతన్యతో శోభిత ఒక్క మూవీ కూడా చేయలేదు. మరి కలిసి ప్రయాణం చేయకపోతే అతని లక్షణాలు శోభితకు ఎలా తెలిశాయనే చర్చ మొదలైంది.
కాగా సమంత గురించి కూడా ఆమె స్పందించడం విశేషం. ది ఫ్యామిలీ మాన్ 2 కి సమంత బెస్ట్ ఛాయిస్. సమంత ప్రాజెక్ట్స్ ఎంపిక గొప్పగా ఉంటుంది. ఆమె కెరీర్లో మరింత రాణిస్తారని పొగడ్తల్లో ముంచెత్తింది. నాగ చైతన్య-శోభిత డేటింగ్ చేస్తున్నారని బలంగా టాలీవుడ్ వర్గాలు నమ్ముతున్నాయి. ఏదో ఒక రోజు కుండబద్దలు కొట్టే ఆస్కారం కలదు.
శోభిత నటించిన ది నైట్ మేనేజర్ 2 సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 30 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఆమె పాల్గొంటున్నారు. ది మంకీ మాన్ టైటిల్ తో శోభిత ఓ హాలీవుడ్ చిత్రం చేస్తున్నారు. ఇక నాగ చైతన్య వరుస ప్లాప్స్ ఇబ్బందిపడుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీస్ థాంక్యూ, కస్టడీ పరాజయం పొందాయి.