Dil Raju On Tholi Prema: చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చి స్టార్ హీరో గా నిలబెట్టిన చిత్రం ‘తొలిప్రేమ’. కరుణాకరన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. ఇప్పటికీ ఈ సినిమాని టీవీ లలో చూస్తుంటే చాలా ఫ్రెష్ సినిమాని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఆయన కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిల్చిన ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం విడుదలై పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీమాత క్రియేషన్స్ సంస్థ, ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసి 4K HD క్వాలిటీ కి మార్చి జూన్ 30 వ తారీఖున గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి డైరెక్టర్ కరుణాకరన్ , నిర్మాత GVG రాజు , దిల్ రాజు మరియు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ముఖ్య అతిధులుగా హాజరై, ఈ సినిమాతో తమకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ నా జీవితాన్ని ఎవరైనా బయోపిక్ రాస్తే అందులో ఒక ఫుల్ పేజీ తొలిప్రేమ గురించి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే నేను డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి కొత్తగా వచ్చాను, ఈ సినిమా ఓపెనింగ్ రోజు AVG రాజు గారిని కలిసి, ఈ సినిమాని నేను చేస్తాను సార్ అన్నాను. ఆయన వెంటనే ఓకే చెప్పి ఈ చిత్రాన్ని కేవలం సింగల్ సిట్టింగ్ లోనే మాకు ఇచ్చేసారు. ఈ సినిమా ఇప్పటికే రెండు మూడు సార్లు నేనే రీ రిలీజ్ చేశాను, నా దగ్గర డబ్బులు తక్కువ అయ్యినప్పుడు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసి డబ్బులు పోగు చేసుకునేవాడిని, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ఈనెల 30 వ తారీఖున విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఒకసారి థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చెయ్యండి.తొలిప్రేమ వందవ రోజు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది, అయినా కానీ జనాలు ఒక జాతర లాగ వచ్చారు, క్రౌడ్ ని కంట్రోల్ చెయ్యలేక సంధ్య 35 కూడా యాడ్ చేసాము,నా చరిత్రలో ఎప్పుడు అలాంటి అద్భుతం చూడలేదు, మళ్ళీ అదే రిపీట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు.