https://oktelugu.com/

అడివి శేష్ ‘మేజర్’ సినిమాలో శోభిత ధూలిపాళ

యంగ్ హీరో అడివి శేష్ ‘మేజర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్.జి.) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు. ముంబైలోని తాజ్ మహల్ హోటల్లో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురి ప్రాణాల్ని కాపాడి, ఆ క్రమంలో తన ప్రాణాల్ని త్యాగం చేసిన సైనికుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందిస్తున్నారు. తెలుగు, హిందీ – ద్విభాషా చిత్రంగా […]

Written By: , Updated On : March 2, 2020 / 03:04 PM IST
Follow us on

యంగ్ హీరో అడివి శేష్ ‘మేజర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్.జి.) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు. ముంబైలోని తాజ్ మహల్ హోటల్లో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురి ప్రాణాల్ని కాపాడి, ఆ క్రమంలో తన ప్రాణాల్ని త్యాగం చేసిన సైనికుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందిస్తున్నారు.

తెలుగు, హిందీ – ద్విభాషా చిత్రంగా మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఘట్టమనేని మహేష్ బాబు (జి.ఎం.బి.) ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా శోభిత ధూలిపాళ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని చిత్ర బృందం తెలిపింది. హీరో అడివి శేష్ తన ట్విట్టర్ పేజీలో స్పందిస్తూ, “మా మునుపటి ఫిల్మ్ ‘గూఢచారి’ తర్వాత ‘మేజర్’ సినిమా కోసం శోభితతో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీలో ఆమె భావోద్వేగపరమైన మంచి డెప్త్ ఉన్న డైనమైట్ లాంటి రోల్ ఆమె చేస్తోంది.

ప్రస్తుతం, ‘మేజర్’ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతోంది. అక్కడ ముఖ్య తారాగణంపై ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.