spot_img
Homeఎంటర్టైన్మెంట్Sobhan Babu- Balakrishna: ఒకే టైటిల్‌ తో వచ్చిన బాల‌య్య - శోభ‌న్‌బాబు.. ...

Sobhan Babu- Balakrishna: ఒకే టైటిల్‌ తో వచ్చిన బాల‌య్య – శోభ‌న్‌బాబు.. ఎవరు హిట్టో తెలుసా?

Sobhan Babu- Balakrishna: గతంలో విడుదలైన తెలుగు సినిమా పేర్లనే.. మళ్ళీ తమ కొత్త తెలుగు సినిమాలకు పెట్టుకుంటున్నారు మేకర్స్. కార‌ణం.. టైటిల్స్ కొర‌త ఒకటి అయితే… రెండో కార‌ణం డ‌బ్బింగ్ సినిమాల‌కు వేరే దారి లేక సేమ్ టైటిల్స్ ను యూజ్ చేస్తున్నారు. కానీ, గ‌తంలో ఓ టైటిల్‌ రిపీట్ కావాలి అంటే.. చాలా టైమ్ ప‌ట్టేది. ఇప్పుడు మాత్రం చాలా తక్కువ సమయంలోనే వాడిన టైటిల్‌ నే మ‌ళ్లీ వాడేస్తున్నారు.

Sobhan Babu- Balakrishna
Balakrishna

నిజానికి ఒక్క సినిమా విడుదలైన తర్వాత, దాదాపు 12 ఏళ్ల పాటు మళ్ళీ ఆ పేరును ఇంకో సినిమాకు పెట్టకూడదు. నిర్మాత మండలి ఈ షరతు పెట్టింది. కానీ, కొన్నిసార్లు ఈ షరతు వర్తించలేదు. ఒక్కే టైటిల్ తో రెండు సినిమాలు రావడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. కానీ, మీకు తెలుసా ? అప్పట్లో కూడా ఇలాగే కొన్ని సందర్భాల్లో జరిగింది.

Also Read: Passenger Landed Plane: పైలెట్ పరిస్థితి విషమం.. విమానాన్ని సురక్షితంగా ఇలా దించిన ప్రయాణికుడు

టాలీవుడ్ అప్పటి స్టార్ హీరో శోభన్ బాబు, నిన్నటి తరం స్టార్ బాలకృష్ణ ఒక్కే టైటిల్ తో సినిమాలు చేశారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా? ‘తల్లిదండ్రులు’. మరి ఈ టైటిల్ తో ‘బాలయ్య – శోభన్ బాబు’ చేసిన సినిమాల్లో ఏ సినిమా హిట్ అయ్యిందో చూద్దాం రండి. 1970 లో మొదట శోభన్ బాబు హీరోగా తల్లిదండ్రులు అనే చిత్రం వచ్చింది.

Sobhan Babu- Balakrishna
Sobhan Babu

ఈ చిత్రంలో శోభ‌న్‌ బాబు సరసన చంద్ర‌కళ హీరోయిన్ గా న‌టించింది. మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో శోభ‌న్‌ బాబుకు త‌ల్లిగా మ‌హాన‌టి సావిత్రి నటించారు. తండ్రిగా జగ్గ‌య్య న‌టించారు. ఆ రోజుల్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. పైగా శోభన్ బాబు అభిమానుల‌ను కూడా ఈ చిత్రం అంత‌గా అల‌రించ‌లేకపోయింది.

మరోపక్క 1991లో బాల‌య్య హీరోగా మ‌ళ్లీ ‘తల్లిదండ్రులు’ టైటిల్‌ తో మ‌రో సినిమా చేశాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా విజ‌య‌శాంతి నటించింది. ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను చాలా బాగా ఆక‌ట్టుకుంది. భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మొత్తానికి ఒకే టైటిల్ తో వస్తే.. బాల‌య్య హిట్ కొట్టాడు, శోభ‌న్‌బాబు సినిమా మాత్రం ఫట్ అయ్యింది.

Also Read:Shiaji Shinde Kota: యముడిగా షియాజీషిండే సూట్ అవుతాడా? షాకింగ్ కామెంట్స్ చేసిన కోటా శ్రీనివాసరావు

Recommended Videos:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Oktelugu Epaper