Dhanush : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. తెలుగు దర్శకులు సైతం మన హీరోలను కాదని తమిళ్ వాళ్లతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. దానికి మన డైరెక్టర్ తమిళ్ వాళ్లతో సినిమాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే… ఒక జెన్యూన్ కథని చెబితే మన హీరోలు అందులో 100 తప్పులను వెతుకుతూ ఉంటారు. కథను మార్చమని చెబుతూ ఉంటారు. వాళ్ళ ఇమేజ్ కి కొన్ని సీన్స్ అడ్డొస్తున్నాయని తమ అభిమానులు ఇలాంటి పాత్రలో తమను చూస్తే ఒప్పుకోలేరని చెబుతూ ఉంటారు. దీనివల్ల కథ మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరమైతే వస్తుంది. దాని వల్ల కథలో ఉన్న సోల్ అయితే చచ్చిపోతుంది… అందుకే మన హీరో రిజెక్ట్ చేసిన కథలను తమిళ్ హీరోలతో చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా వెంకీ అట్లూరీ(Venky Atluri) లాంటి దర్శకుడు అయితే వరుసగా తమిళ్, మలయాళం హీరోలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తమిళ్ ఇండస్ట్రీ నుంచి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ధనుష్… ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతూ ఉంటాయనే పేరునైతే సంపాదించుకున్నాడు. ఇక ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇస్తాడు. అందువల్లే ఆయన సినిమాలను చూడడానికి ఇండియాలో ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ధనుష్ లిస్టులో చాలామంది దర్శకులు ఉన్నారు. అందులో తెలుగు దర్శకులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికీ శేఖర్ కమ్ముల (Shekar Kammula) తో కుబేర (Kubera) అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరితో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక వీళ్ళతో పాటుగా’మంగళవారం'(Mangalavaram) సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘అజయ్ భూపతి’ (Ajay Bhupathi) కూడా ఇప్పుడు ధనుష్ (Dhanush) తోనే ఒక ప్రాజెక్టు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా సాగుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఈ ముగ్గురు దర్శకులే కాకుండా మరి కొంతమంది కొత్త దర్శకులు కూడా ధనుష్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అమరన్ (Amaran) సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇలా రెండు సంవత్సరాల వరకు ధనుష్ డైరీ ఫుల్ అయిపోయింది…