https://oktelugu.com/

Theatres : చిన్న పిల్లలకు థియేటర్స్ లోకి అనుమతి లేదా..? సంచలన ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు!

పుష్ప 2 ప్రీమియర్ షోస్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ఇండస్ట్రీ ని సమస్యల వలయం లో చిక్కుకునేలా చేసింది.

Written By: , Updated On : January 28, 2025 / 03:51 PM IST
Theatres

Theatres

Follow us on

Theatres : పుష్ప 2 ప్రీమియర్ షోస్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ఇండస్ట్రీ ని సమస్యల వలయం లో చిక్కుకునేలా చేసింది. ఇందులో నుండి బయటపడేందుకు సినీ ఇండస్ట్రీ ఎంతో కష్టపడుతుంది కానీ, అది అయ్యే పనిలాగా అనిపించడం లేదు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి చివరి నిమిషం లో అనుమతిని ఇచ్చారు కానీ, హై కోర్టులో కేసు వేయడంతో వారం రోజుల లోపే ఆ చిత్రానికి ఇచ్చిన హైక్స్ ని రద్దు చేస్తూ,ఇక నుండి తెలంగాణలో టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ ఉండవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘గేమ్ చేంజర్’ తర్వాత విడుదల అవ్వబోయే భారీ బడ్జెట్ టాలీవుడ్ చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాపై ఆ ప్రభావం పడుతుందా లేదా అనేది చూడాలి.

ఇదంతా పక్కన పెడితే హై కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మరో కీలక ఆదేశం జారీ చేసింది. 16 వయస్సు కంటే తక్కువ వయసులో ఉన్న చిన్న పిల్లలను రాత్రి 11 గంటల నుండి ఉదయం 11 గంటల లోపు ప్రదర్శించే షోస్ కి అనుమతించకూడదని, చిన్న పిల్లల సేఫ్టీ ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్నీ మీ ముందు ఉంచామని, దానికి మీరొక నిర్ణయం తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది హై కోర్టు. దీనిపై ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి. తెలుగు సినిమా స్థాయి కలెక్షన్స్ పరంగా హాలీవుడ్ రేంజ్ కి ఎదుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి కఠినమైన నిబంధనలు రావడం దురదృష్టకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వందల కోట్లు ఖర్చు చేసి ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్ కలిగించే సినిమాలు చేస్తున్నామని, ఊరికే అంతంత టికెట్ రేట్స్ కోరుకోవడం లేదని, ఇలా చీటికీ మాటికీ ఆంక్షలు పెడితే పెద్ద సినిమాలు రాబోయే కాలం లో తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప చిత్రానికి హైక్స్ ఇవ్వడం వల్లే ఆ చిత్రం కేవలం తెలంగాణ ప్రాంతం నుండి వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ చిత్రం వల్ల తప్పు జరిగితే ఆ సినీ నిర్మాతలు, హీరో కావాల్సినంత డబ్బులు పిండుకొని వెళ్లిపోయారు, కానీ ఆ తర్వాత వచ్చే సినిమాలు ఎఫెక్ట్ అవ్వాలా? అంటూ సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానులు బాధపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన సినిమా వరకు రేట్స్ రావొచ్చు. ఈ ఏడాది ప్రభాస్ నుండి రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ బుచ్చి బాబు చిత్రం కూడా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కాబోతున్నాయి. వీటికి కూడా టికెట్ హైక్స్ బెనిఫిట్ షోస్ వస్తాయా లేదా అనేది చూడాలి.