https://oktelugu.com/

Actors: స్థాయిలో చిన్న నటులైనా నటనలో పెద్ద నటులు !

Actors: నటులందు తెలుగు మహా నటులు వేరయా అన్నారు నిన్నటి తరం ప్రేక్షకులు. నిజమే.. తెలుగులో వచ్చిన సహనటుల్లో మహానటులు ఉన్నారు. అదే వేరే భాషలో అయితే.. సహజంగానే సినిమాల్లో సహనటులు అంటే.. స్థాయి తక్కువ వారు అని బలంగా నమ్ముతారు. కానీ తెలుగులో మాత్రం మంచి నటుడికి మంచి గుర్తింపు దక్కుతుంది. అయితే, సహాయ నటులు ఎంత గొప్పగా నటించినా హీరో హీరోయిన్ లను డామినేట్ చేయలేరు. దర్శకుడు చేయనివ్వడు. అందుకే సహాయ నటుడు ఒక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 22, 2021 / 04:21 PM IST
    Follow us on

    Actors: నటులందు తెలుగు మహా నటులు వేరయా అన్నారు నిన్నటి తరం ప్రేక్షకులు. నిజమే.. తెలుగులో వచ్చిన సహనటుల్లో మహానటులు ఉన్నారు. అదే వేరే భాషలో అయితే.. సహజంగానే సినిమాల్లో సహనటులు అంటే.. స్థాయి తక్కువ వారు అని బలంగా నమ్ముతారు. కానీ తెలుగులో మాత్రం మంచి నటుడికి మంచి గుర్తింపు దక్కుతుంది. అయితే, సహాయ నటులు ఎంత గొప్పగా నటించినా హీరో హీరోయిన్ లను డామినేట్ చేయలేరు.

    దర్శకుడు చేయనివ్వడు. అందుకే సహాయ నటుడు ఒక తెలుగు సినిమాలో హీరోని మించి పోవడం అనేది దాదాపు అసాధ్యం. కానీ కొందరు సహాయ నటులు తమకున్న తక్కువ స్క్రీన్ టైంలోనే.. హీరోలు, ప్రధాన పాత్ర ధారుల కన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్నవారిని చూద్దాం. పాపారాయుడు పాత్ర – పెదరాయుడులో రజనీకాంత్ పాత్ర. కానీ, రజినీకాంత్, హీరోగా చేసిన మోహన్ బాబును డామినేట్ చేశారు. పైగా సినిమాలో మోహన్ బాబు డబుల్ యాక్షన్. అయినా పెదరాయుడు అనగానే రజనీకాంత్ పాత్రనే గుర్తుకు వస్తుంది.

    ఇక బ్రహ్మానందం వేసిన కొన్ని పాత్రలు నిడివిలో చిన్నవి అయినా, హీరో పాత్రల కన్నా పేరొచ్చిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా రేసుగుర్రం సినిమా క్లైమాక్స్‌ లో బ్రహ్మానందం కొద్ది సేపే వచ్చినా, హీరో కన్నా మంచి పేరును సాధించాడు. నిజానికి బ్రహ్మానందం పాత్ర క్లైమాక్స్ సీక్వెల్ లో లేకపోయి ఉంటే, సినిమా ఏవరేజ్ అయి ఉండేది. అంతఃపురంలో జగపతిబాబు పాత్ర. సినిమా ఇక 40 నిమిషాల్లో అయిపోతుందనగా ఈ పాత్ర వస్తుంది. కరెక్ట్ గా ఈ పాత్ర తెర మీద కనిపించేది.. 20 నిమిషాలే. కానీ, ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోయింది.

    Also Read: RC15: చరణ్​- శంకర్​ కాంబో సినిమా శాటిలైట్​ రైట్స్​ ఎవరివంటే?

    చందమామ సినిమాలో ‘ఆహుతి ప్రసాద్’ వేసిన రామలింగేశ్వరరావు పాత్ర కూడా మిగిలిన పాత్రలను బాగా డామినేట్ చేస్తోంది. ఇలా హీరోల కన్నా గొప్ప పేరు తెచ్చుకున్న సహాయ నటులు కొందరు ఉన్నారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో గొల్లపూడి మారుతీరావు, అలాగే ఎం. ఎస్. నారాయణ, కోట శ్రీనివాసరావులు కూడా కొన్ని సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు.

    Also Read: Simbu: రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్నాం.. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాం- శింబు

    Tags