https://oktelugu.com/

Samantha: అమెరికాలో సమంత కి స్కిన్ ట్రీట్మెంట్.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు సమంతకు ఏమైంది ?

Samantha: సమంత గత వారం సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో ప్రత్యేక పూజలు చేయించింది. ఐతే, ఈ పూజకు సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కారణం.. ఈ ఫొటోల్లో స‌మంత చాలా డ‌ల్‌ గా క‌నిపించింది. పైగా క‌ళ్ల‌ద్దాలు పెట్టుకొని మొఖం లాగేసి బాగా డల్ గా ఉంది. సడెన్ గా చూస్తే.. సామ్ ఒక పేషెంట్ లా ఉంది. అందుకే, ఆమె పై ఇప్పుడు రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. వాటిలో […]

Written By:
  • Shiva
  • , Updated On : September 18, 2022 / 04:46 PM IST
    Follow us on

    Samantha: సమంత గత వారం సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో ప్రత్యేక పూజలు చేయించింది. ఐతే, ఈ పూజకు సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కారణం.. ఈ ఫొటోల్లో స‌మంత చాలా డ‌ల్‌ గా క‌నిపించింది. పైగా క‌ళ్ల‌ద్దాలు పెట్టుకొని మొఖం లాగేసి బాగా డల్ గా ఉంది. సడెన్ గా చూస్తే.. సామ్ ఒక పేషెంట్ లా ఉంది. అందుకే, ఆమె పై ఇప్పుడు రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. వాటిలో ప్రధానంగా స‌మంత కొన్నాళ్లుగా చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంద‌ని, అందుకే సామ్ బ‌య‌ట‌కు రావ‌టం లేద‌ని ఓ వార్త బాగా వైరల్ అయింది.

    Samantha

    దీనికి తోడు చర్మసంబంధ సమస్యల వల్ల సమంత షూటింగ్‌ల్లో పాల్గొనడం లేదని, ఆమె నటిస్తున్న కొన్ని సినిమాల టీమ్ ల నుంచే వార్త లీక్ అయింది. దాంతో సామ్ పై రోజుకో పుకారు బాగా షికారు చేసింది. ఇక చేసేది ఏం లేక స‌మంత ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ కూడా ఈ వార్త పై రియాక్ట్ అయ్యాడు. ‘కొంద‌రు కావాల‌నే స‌మంత‌పై త‌ప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఆమెకు ఎలాంటి స‌మ‌స్యా లేదు. ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.

    పైగా స‌మంత‌పై త‌ప్పుడు వార్త‌ల‌ను క్రియేట్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని సమంత ఆలోచిస్తుంది’ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా వార్తలు ఆగలేదు. కారణం సోషల్ మీడియాలో కూడా సమంత కనిపించక పోవడమే. పైగా ఖుషి సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో సామ్ పై లేటెస్ట్ గా ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది.

    Samantha

    ఇంతకీ ఆ న్యూస్ ఏమిటో తెలుసా ?, త్వరలో సామ్ స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తోందని సమాచారం. అక్కడున్న టాప్ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోనుందట. అందుకే ఖుషి షూటింగ్‌లో కూడా పాల్గొనలేనని చెప్పిందట. దీంతో ఆ మూవీ రిలీజ్ ఆలస్యం కానుందనట. మొత్తానికి సమంతకి ఆరోగ్య సమస్యలు వచ్చాయని తేలిపోయింది.

    అయితే, ఆసక్తికరంగా ఈ విషయంలో నాగచైతన్య ఫ్యాన్స్ సమంతకి సపోర్ట్ చేస్తున్నారు. ఆమె వెరీ టాలెంటెడ్ నటి అని, త్వరగా కోలుకుని సామ్ తిరిగి సినిమాల్లో యాక్టివ్ గా నటిస్తోందని వారు కామెంట్స్ చేస్తున్నారు.

    Tags