Skanda Collections: బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబో లో వచ్చిన స్కంద సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.బోయపాటి తన కెరియర్ లో బాలయ్య లాంటి హీరో తో హ్యాట్రిక్ సినిమాలు తీసి మంచి హిట్లు కొట్టాడు.అయితే బోయపాటి శ్రీను ఆ తర్వాత యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. నిజానికి ఈయన బాలయ్య తో చేసిన అఖండ మూవీ సక్సెస్ అవ్వడం తో వేరే స్టార్ హీరో తో కూడా సినిమా చేసే అవకశాహ్మ్ ఉంది కానీ రామ్ తో సినిమా చేయడానికి కారణం ఆయన ఇంతకు ముందే ఆ సినిమాకి కమిట్ అవ్వడం వల్ల ఆయనతో సినిమా చేయడం జరిగింది…
ఇక ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి సక్సెస్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకొని రామ్ కెరియర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా గా నిలిచింది.అందుకే ఈ సినిమా కి మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే రెండొవ రోజు ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టడం లో కొంత వరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా మొదటి రోజు దాదాపు 3.50 కోట్ల షేర్,5.90 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ని రాబట్టింది.
ఇక రెండు రోజులు కలిపి నైజాం లో 4.77 కోట్లు మాత్రమే రాబట్టింది, ఇక సీడెడ్ లో మాత్రం 1.75 కోట్లు రాబట్టగా, ఉత్తరాంధ్ర, ఈస్టు, వెస్ట్ అంత కలిపి 12 .12 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.అలాగే 19 .40 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 .57 కోట్ల షేర్ రాబట్టగా 24.30 గ్రాస్ ని రాబట్టడం జరిగింది.అయితే చాలా అంచనాల తో వచ్చిన ఈ సినిమా 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవడం తో 47 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది ఇక ఇప్పటి వరకు ఈ సినిమా 14.57 కోట్ల వరకు మాత్రమే కలక్షన్స్ ని రాబట్టింది. ఇక దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా దాదాపు గా ఈ సినిమా 33 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది.అలా కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, లేకపోతే ఈ సినిమాకి నష్టాలు తప్పవు అంటూ ట్రేడ్ పండితులు వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ ఇప్పటికే డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దానితో పాటు గా మరో కొత్త డైరెక్టర్ తో కూడా సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇక బోయపాటి కూడా ఈ సినిమా తర్వాత సూర్య తో ఒక సినిమా, బాలయ్య తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా లో హీరోయిన్ అయిన శ్రీలీల కూడా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు కమిట్ అయి ఉంది…