Ram Charan- SJ Surya: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. కాగా ఈ సినిమాలో ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించబోతున్నాడు. అయితే, సూర్య పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో సూర్య సీఎంగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఓ ముఖ్యమంత్రికీ, ఎన్నికల కమీషనర్ కీ మధ్య నడిచే సమరమే ఈ సినిమా అని టాక్ నడుస్తోంది.

కాగా ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుని.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ను ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ లో రామ్ చరణ్ పై ఫైటింగ్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. అన్నట్టు ఆ వెంటనే అమృత్ సర్ లోనూ షూటింగ్ జరగనుంది.
Also Read: బీజేపీకి సైతం అసమ్మతి పొగ తప్పడం లేదా?
ఇక రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నాడు. చరణ్ కి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. అన్నట్టు శంకర్ ఈ సినిమాతో తన దర్శకత్వ పరిధిని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్.

మరి ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. పైగా ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. అన్నట్టు ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.
Also Read: సినీనటుడు ప్రకాశ్ రాజ్ కు పదవి ఖాయమేనా?
[…] Deepika Padukone: దీపికా పదుకొణె పెళ్లి అయ్యాక మరి బోల్డ్ గా మారిపోతుంది. తాజాగా ఆమె నటించిన గెహ్రాహియా సినిమాలో రొమాంటిక్ సీన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న దీపికా పదుకొనే.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫిల్మ్‌ఫేర్ కోసం దిగిన కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫోటోల్లో ఆమె విచిత్రమైన డ్రెస్‌లతో అందాల విందు చేయడంతో మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి దీపిక ప్రైవేటు భాగాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. […]
[…] Also Read: చరణ్ సినిమాలో సీఎంగా ‘సూర్య’ […]
[…] ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండటం, అందులోనూ పవర్‌స్టార్ మూవీ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు […]