https://oktelugu.com/

SJ Surya: సైకో అంటే చాలు మెంటల్ ఎక్కి పోతాడు.. టచ్ చేసి సూర్య పాత్రలు అంటేనే వైరల్

ఒక సినిమా తీయడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి క్రమం లోనే నటులు చాలా మంది వాళ్ళకంటు ఉత్తమమైన నటనను కనపరిచినట్లయితే వాళ్ళు చేసే ప్రతి పాత్ర కూడా ఇక్కడ ఎలివేట్ అవుతుందనే చెప్పాలి. అందుకే ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే నటి నటుల పర్ఫామెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం శక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : August 31, 2024 / 09:40 AM IST

    SJ Surya

    Follow us on

    SJ Surya: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. నిజానికి అక్కడ ఉన్న చాలామంది నటుల్లో విజయ్ సేతుపతి, ఎస్ జే సూర్య లాంటి స్టార్ నటులు కూడా ఉండడం విశేషం. వీళ్ళు ఎలాంటి పాత్రనైనా సరే అలవొకగా చేస్తూ ఇండస్ట్రీలో తమను మించిన నటుడు మరొకరు లేరు అనెంతలా గుర్తింపుని సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది.
    అందువల్లే వీళ్ళు చేస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎస్ జే సూర్య లాంటి నటుడు మొదట దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత నటుడిగా మారడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. అలాంటి నటుడు ఎలాంటి పాత్రనైనా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చెప్పడం విశేషం… ముఖ్యంగా ఆయన సైకో పాత్రలు చేయడంలో మాత్రం దిట్ట…

    మొదటినుంచి సైకో పాత్ర కోసం సపరేట్ గా తన మాడ్యులేషన్ గాని తన మేనరిజమ్స్ ని మార్చుకుంటూ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్ ‘ సినిమాలో ఒక సైకో విలన్ క్యారెక్టర్ లో నటించి తన శాడిజాన్ని చూపించాడు. అలాంటి వాటిలో ఎస్ జే సూర్య నటించిన నటన చాలా కొత్తగా ఉంటుంది. నిజంగా అప్పటివరకు అది చాలా కొత్తగా ఉండడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా హై ఫీల్ అయితే ఇచ్చింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కానప్పటికీ ఆయన పాత్రకి మంచి పేరు అయితే వచ్చింది.

    ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు ఒకెత్తు అయితే రీసెంట్ గా నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఒక సైకో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించాలనే ప్రయత్నం చేశాడు. ఇక అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఎస్ జే సూర్య సైకో పాత్రల్లో నటించడానికి తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందనే ఉద్దేశ్యంతో అలాంటి పాత్రలను ఎక్కువగా ఎంచుకోవాలని చూస్తారట. ఇక ఇప్పుడు కూడా ‘సరిపోదా శనివారం’ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు.

    నాని లాంటి నాచురల్ స్టార్ ను సైతం డామినేట్ చేస్తూ ఆయన కనబరిచిన నటన నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయంటూ సినిమా చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా తెలియజేయడం విశేషం…ఇక ముందు ముందు రోజుల్లో ఆయన స్టార్ విలన్ గా మారడం పక్క అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈయన మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…