SJ Surya: తెలుగులో స్టార్ హీరోలతో పాటు పోటీపడి నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు నాని…ఈయనకు మార్కెట్ పరంగా స్టార్ హీరో అంత రేంజ్ లేకపోయినప్పటికి తన సినిమాలతో ప్రేక్షకులలో అటెన్షన్ ని క్రియేట్ చేసే సత్తా అయితే ఉంది. ఇక ఇదే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను ఏర్పాటు చేసుకోవడంలో కూడా నాని చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే కావడం విశేషం.. ఇక రీసెంట్ గా ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఆయనకు ఒక మంచి సక్సెస్ ని అందించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో నాని స్టామినా ఏంటి అనేది కూడా ప్రూవ్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో నాని నాచురల్ స్టార్ గా మరొకసారి అదరగొట్టాడు. ఇక అలాగే మాస్ ఎలిమెంట్స్ తో కూడా ఈ సినిమా మొత్తానికి తనదైన హంగులను అద్దాడనే చెప్పాలి. మరి మొత్తానికైతే నాని ఈ సినిమాతో సక్సెస్ అందుకొని ఇప్పుడు నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా కూడా ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మధ్య నాని వరుసగా మాస్ సినిమాలను చేస్తున్నాడు. ఇక దానికి కారణం ఏంటి అంటే ఆయన వరుసగా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమాలను చేయడం వల్ల అవన్నీ ఒకే టైప్ పాత్రలుగా అనిపిస్తున్నాయి.
అలాగే నాని యాక్టింగ్ కూడా ఒకేలా అనిపిస్తూ ఉండడం వల్ల చేంజ్ ఓవర్ కోసం ఆయన మాస్ సినిమాల వైపు మల్లుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించిన ఎస్ జె సూర్య తనదైన రీతిలో తన క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. ఇక ముఖ్యంగా ఆయన విలన్ గా చేయడమే కాకుండా ఒక మంచి నటుడి గా కూడా ఆయనలో ఉన్న నటన ప్రతిభా అనేది బయటకు వచ్చింది.
మరి ఇలాంటి సందర్భంలో ఎస్ జె సూర్య యాక్టింగ్ కి తెలుగు ప్రేక్షకులు మొత్తం ఫిదా అయిపోయారు. మరి ఇప్పుడు ఆయనకు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా చేసే అవకాశం వస్తుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికైతే ఆయన సినిమాలో జీవించేసారనే చెప్పాలి. ప్రతి చిన్న డైలాగుని ఆయన డిక్షన్ తో చెప్పి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మధ్య మధ్యలో ఆయన చేసే కామెడీ కూడా ప్రేక్షకులకు హుషారునిచ్చింది…
ఇక రాబోతున్న స్టార్ హీరో సినిమాల్లో కూడా ఆయనకు భారీగా అవకాశాలు అందబోతున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా తొందర్లోనే బయటకు చెప్పబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…