Sivaji: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కు రూ. 35 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం షో ద్వారా వచ్చిన డబ్బులు రైతులకు పంచాల్సి ఉంది. బిగ్ బాస్ షో ముగిసి నెలలు గడుస్తున్నా పల్లవి ప్రశాంత్ ఆ ఊసే ఎత్తకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రైతులకు పంచుతానన్న డబ్బు సంగతేంటీ అంటూ నెటిజన్లు పల్లవి ప్రశాంత్ ని ప్రశ్నించారు. కొందరు దారుణంగా ట్రోల్ చేశారు.
కాగా దీనిపై శివాజీ స్పందించాడు. ప్రశాంత్ ని విమర్శించిన వారిపై ఓరేంజ్ లో ఫైర్ అయ్యాడు. రైతు బిడ్డను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల పల్లవి ప్రశాంత్ తన మొదటి సాయం చేశాడు. ఓ పేద రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం అందించాడు. ఈ కార్యక్రమంలో శివాజీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ .. రైతుల కలలకు, కష్టాలకు అండగా నిలబడిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోకి వెళ్లాలన్న కల నెరవేర్చుకున్నాడు.
గాయాలను లెక్క చేయకుండా, మానసిక దాడిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాడు. ప్రశాంత్ గురించి మీకు తెలుసా? అతడు చేసే పనుల గురించి తెలియకుండా ఎలా ప్రశ్నిస్తారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిని పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. అదే మీకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి నెరవేర్చని రాజకీయ నాయకులని ప్రశ్నించగలరా? ఎన్నో చేస్తాము అని ఆశ చూపించి చేయని వారిని నిలదీయగలరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్రశాంత్ కి ఎంతో చేయాలని ఉంది. కానీ బిగ్ బాస్ షో నుండి తనకు రావాల్సిన డబ్బులు ఆలస్యం అవడంతో అతను చేయాలి అనుకున్న పనులు చేయలేకపోతున్నాడు. బిగ్ బాస్ షో లో పాల్గొన్న వెంటనే డబ్బులు ఇవ్వరు. విడతల వారిగా ఇస్తారు. నాలుగు నెలలు ప్రశాంత్ ఎలాంటి పనులు చేయకుండా, ఆదాయం లేకుండా ఉన్నాడు. వాడికి ఆర్థిక అవసరాలు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అందుకే పూర్తి డబ్బులు వచ్చిన తర్వాత వాడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడు అంటూ శివాజీ వివరణ ఇచ్చారు. ట్రోలర్స్ కి సమాధానం చెప్పాడు.
Web Title: Sivajis shocking comments on pallavi prashanth helping
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com