Sivaji : ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న శివాజీ(Sivaji), ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మంచి నటుడు అనే పేరు అయితే బలంగానే ఉంది కానీ, ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే శివాజీ బిగ్ బాస్(Bigg Boss 7 Telugu) లోకి అడుగుపెట్టాడో, అప్పటి నుండే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత చేరువ అయ్యాడు. అందరూ శివన్న అంటూ ప్రేమగా పిలుచుకునే స్థాయిని సంపాదించాడు. ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్స్ లో శివాజీ లాంటి మాస్టర్ మైండ్ గేమర్ ఎవ్వరూ లేరు అనడంలో అతిశయోక్తి లేదేమో. ఆ స్థాయి క్రేజ్ ని సంపాదించుకున్నాడు శివాజీ. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు అడుగుపెట్టిన వెంటనే ఆయన చేసిన ’90s’ వెబ్ సిరీస్ విడుదలై సంచలన విజయం సాధించింది.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?
ఇక ఆ తర్వాత ఆయన నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్'(Court Movie) చిత్రంలో మంగపతి క్యారక్టర్ చేసి సెన్సేషన్ సృష్టించేసాడు. ఆ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అంటే అందుకు కారణం కచ్చితంగా శివాజీ నే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ స్థాయిలో రెచ్చిపోయి మరీ నటించాడు. శివాజీ లోని ఇంత అద్భుతమైన నటనను చూసి ఆయనతో సినిమాలు చేసేందుకు ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ సైతం క్యూలు కడుతున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఆయన డైరెక్టర్ సుకుమార్ ని కలిసిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేయగా, అవి తెగ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన ప్రతీ ఒక్కరు సుకుమార్ సినిమాలో శివాజీ ఛాన్స్ కొట్టేసినట్టు ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
త్వరలోనే సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శివాజీకి ఏదైనా ముఖ్యమైన క్యారక్టర్ దొరికిందా?, లేకపోతే రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం లో ఏదైనా క్యారక్టర్ దొరికిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘పెద్ది’ మూవీ స్టోరీ ‘సుకుమార్ రైటింగ్స్’ నుండి వచ్చినదే. డైరెక్టర్ బుచ్చి బాబు కి ఏదైనా ముఖ్యమైన క్యారక్టర్ కి పలానా నటుడు సరిపోతాడు అనుకుంటే కచ్చితంగా సుకుమార్ రికమెండ్ చేస్తాడు. అలా శివాజీ ని ‘పెద్ది’ సినిమాలో ఏదైనా ముఖ్యమైన క్యారక్టర్ కోసం తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ తీసుకుంటే మాత్రం సినిమాకు శివాజి ప్లస్ అవ్వడమే కానీ, మైనస్ అవ్వడం మాత్రం జరగదు. కానీ నిజంగా ఛాన్స్ దొరికితే మాత్రం శివాజీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడు అనే చెప్పాలి.