Sivaji On Pallavi Prashanth: నటుడు శివాజీ బిగ్ బాస్ ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చాడు. ముఖ్యంగా గురు శిష్యులు ఒక చోట కలిశారంటే ఆ వీడియోలు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ శిష్యులుగా వ్యవహరించిన ప్రశాంత్, యావర్ లలో ఒకరు విన్నర్ గా మరొకరు 15 లక్షల డబ్బుతో టాప్ 4 గా బయటకు వచ్చారు. శివాజీ, ప్రశాంత్, యావర్ ల బాండింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొదటి నుంచి ప్రశాంత్, యావర్ లను సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేసింది.
దీంతో శివాజీ… ప్రశాంత్, యావర్ లకు అండగా నిలిచాడు. వారికి కష్టం లోను .. సుఖం లోను తోడుగా ఉన్నాడు శివాజీ. ఆ ఇద్దరినీ గైడ్ చేస్తూ ముందుకు నడిపించాడు. శివాజీకి చేతికి గాయం అయినప్పుడు ప్రశాంత్, యావర్ లు సేవలు చేశారు. శివాజీ వెళ్ళిపోతాను అంటుంటే .. నువ్వు ఉండాలి అన్నా అంటూ ధైర్యం చెప్పారు. వారికి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను చూసి ఆడియన్స్ స్పై గ్రూప్ ఫ్యాన్స్ అయ్యారు.
తాజాగా శివాజీ ఓ ఇంటర్వ్యూ లో శిష్యులని పొగడ్తలతో ముంచెత్తాడు. వాళ్ళని హీరోలతో పోలుస్తూ ప్రశంసలు కురిపించాడు. ప్రశాంత్, యావర్ లు ఫ్యూచర్ లో గొప్ప స్థాయిలో ఉంటారని ఆయన అన్నారు. యావర్ మంచి నటుడు. అతనిలో గొప్ప ట్యాలెంట్ ఉంది అన్నాడు.
ఇక ప్రశాంత్ గురించి మాట్లాడుతూ .. ప్రశాంత్ వంటి నటులను కోలీవుడ్ లో చూస్తాం. చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ ఒక ధనుష్ అని చెప్పొచ్చు. ధనుష్ లాగా చేయగలిగే కెపాసిటీ ప్రశాంత్ లో ఉంది. కానీ వాడిని మలిచేవాడు కావలి. అలాంటి మలిచేవాడు దొరికితే ప్రశాంత్ పట్టుకుంటాడు. ధనుష్ అంత అని నేను అనను కానీ .. ఎందుకు కాకూడదు. కోట్ల మంది అభిమానం పొంది బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ధనుష్ అంత పెద్ద హీరో ప్రశాంత్ అవ్వొచ్చేమో .. ఎవరికి తెలుసు .. అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు.