Sivaji-as-the-host-of-Bigg-Boss-8
Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు 8 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సరికొత్త సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా మొదలైనట్లు తెలుస్తుంది. కొందరు యూట్యూబర్స్, బుల్లితెర సెలెబ్రేటిస్ ని బిగ్ బాస్ టీం సంప్రదించారట. సీజన్ 7 సూపర్ హిట్. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం సంచలనంగా మారింది.
పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. అమర్ దీప్ రన్నర్ కాగా శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫినాలే రోజున జరిగిన అల్లర్లు మినహా సీజన్ 7 మొత్తంలో ఎటువంటి కాంట్రవర్సీ రాలేదు. చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంది. దీంతో సీజన్ 8 ని అనుకున్న సమయానికి ముందే తీసుకురావలని ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు లో సీజన్ 8 ప్రారంభం కానుందని సమాచారం.
Also Read: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బాటలో అనసూయ… వాస్తవం తెలిసొచ్చిందా?
ఈ క్రమంలో మాజీ కంటెస్టెంట్ శివాజీకి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందట. బిగ్ బాస్ బజ్ సీజన్ 8 కి హోస్ట్ గా శివాజీ ఎంపిక అయ్యాడట. గత సీజన్ బిగ్ బాస్ బజ్ కి గీతూ రాయల్ హోస్ట్ గా వ్యవహరించింది. తన ముక్కు సూటి ప్రశ్నలతో కంటెస్టెంట్స్ ని అల్లాడించింది. సీజన్ 8 ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేసే అవకాశం శివాజీకి వచ్చిందని సమాచారం. శివాజీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా మొహం మీద అడిగే స్వభావం.
Also Read: Bigg Boss Host: బిగ్ బాస్ హోస్ట్: నాగార్జున కాదంటే ఆ దమ్మున్న స్టార్స్ వీరే!
కాబట్టి కంటెస్టెంట్స్ తప్పు ఒప్పులను నిలదీసే సత్తా ఉంది. శివాజీ బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా చేస్తే కంటెస్టెంట్స్ కి చుక్కలే అని అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే .. సీజన్ 8 లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్ అవుతుంది. యూట్యూబర్ బంచిక్ బబ్లు, రాజ్ తరుణ్, రీతూ చౌదరి, కిరాక్ ఆర్పీ, నేత్ర, సురేఖ వాణి, బర్రెలక్క, హేమ వంటి క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి.
Web Title: Sivaji as the host of bigg boss buzz season 8
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com