Sitare Zameen Par Box Office Collection: సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్(Amir Khan) ‘సితారే జమీన్ పర్'(Sitare Zameen Par) అనే చిత్రం తో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చాలా కూల్ గా విడుదలైన ఈ సినిమాకు బాలీవుడ్ లో మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ కి తగ్గట్టుగానే ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురిసింది. మొదటి వీకెండ్ లో ట్రేడ్ అంచనాలను మించి ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు వచ్చిన వసూళ్లకంటే మూడవ రోజు వచ్చిన వసూళ్లు దాదాపుగా మూడు రెట్లు ఎక్కువ ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం అమీర్ ఖాన్ పవర్ ఫుల్ బ్రాండ్ ఎలాంటిదో నిరూపిస్తూ స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.
Also Read: వెంకటేష్ ‘దృశ్యం 3’ వచ్చేస్తుంది..ఈసారి డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మొదటి రోజు ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రీ రిలీజ్ కి ముందు ఈ సినిమా మీదున్న తక్కువ బజ్ ని చూసి అమీర్ ఖాన్ కి సింగిల్ డిజిట్ ఓపెనింగ్ పడబోతోంది అంటూ ప్రెడిక్ట్ చేశారు. కానీ రెండవ రోజు మొదటి రోజుకు మించి రెండు రెట్లు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం దాదాపుగా 19 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రెండవ రోజు వచ్చాయి. ఇక మూడవ రోజు అయితే ఏకంగా మొదటి రోజు కంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం మూడవ రోజున 26 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. అలా మూడు రోజుల్లో ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 57 కోట్ల 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి మూడు రోజుల్లో 3.32 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 28 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అన్నమాట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ చిత్రానికి మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సాధారణంగా ఇలాంటి సినిమాలకు బాక్స్ ఆఫీస్ వసూళ్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ అమీర్ ఖాన్ బ్రాండ్ ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చేలా చేస్తుంది. అమీర్ నుండి అభిమానులు చాలా కాలం నుండి మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్లకు కావాల్సిన కమర్షియల్ హిట్ అయితే వచ్చేసింది. ఇక ఈ సినిమా రేంజ్ ఎంత వరకు వెళ్లి ఆగుతుంది అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది.