Mrunal Thakur: సీతారామం మూవీ మృణాల్ ఠాకూర్ కి ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చింది. ఈ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది. అంతకు మించి గొప్ప ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు హను రాఘవపూడి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ నటన పేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ యువకుల మనసులు దోచేసింది. చాలా రోజులు ఆమె జ్ఞాపకాలు వెంటాడేలా చేసింది.
సీతారామంలో చీర, లంగాఓణీలో దర్శనమిచ్చిన మృణాల్ ఆఫ్ స్క్రీన్ లో హాట్ బాంబ్ అని చెప్పాలి. అమ్మడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన స్కిన్ షో చేస్తుంది. సీతారామంలో మృణాల్ ని ట్రెడిషనల్ గా చూసిన ఆడియన్స్ ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చూస్తే అవాక్కవడం ఖాయం. తాజాగా బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. టెంప్టింగ్ ఫోజులతో గుండెల్లో సెగలు రేపింది. మృణాల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
మృణాల్ కెరీర్ పరిశీలిస్తే ఆమె సీరియల్ నటిగా ప్రస్థానం మొదలైంది. పలు సక్సెస్ఫుల్ సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేసింది. బుల్లితెర మీద నటిస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. సీరియల్ నటి అని ఆమెను చిన్నచూపు చూసేవారట. ఆమెపై బాడీ షేమింగ్ కి కూడా పాల్పడ్డారట. ఆఫర్స్ కోసం తిరిగే సమయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు మృణాల్ చెప్పుకొచ్చారు.
అలాగే కొన్ని ప్రాజెక్ట్ నుండి మధ్యలో తీసేశారట. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సుల్తాన్ సినిమాలో హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేసి, అనంతరం అనుష్క శర్మతో చేశారట. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయని మృణాల్ చెప్పుకొచ్చింది. లవ్ సోనియా మూవీ మృణాల్ కి బ్రేక్ ఇవ్వగా సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగులో నాని, విజయ్ దేవరకొండ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో అమ్మడు బిజీ అవుతున్నారు.
View this post on Instagram