Mrunal Thakur: స్టార్స్ కి సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరమే. ఇక ప్రేమ, పెళ్లి వంటి వ్యవహారాలు మరింత క్రేజ్ క్రియేట్ చేస్తాయి. తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన ప్రేమ వ్యవహారం బయటపెట్టింది. ఆమె చెప్పిన సంగతులు విని జనాలు షాక్ అయ్యారు. ఓ స్టార్ హీరోని చాలా కాలంగా ప్రేమిస్తున్నాను అంటూ మైండ్ బ్లాక్ చేసింది. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా చిత్రంతో ఫేమ్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న ఈ భామ టాలీవుడ్ పై కన్నేసింది.
దర్శకుడు హను రాఘవపూడి సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల పరిచయం చేశాడు. గత ఏడాది విడుదలైన సీతారామం భారీ విజయం సాధించింది. మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా సీత పాత్రలో మృణాల్ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం తెలుగులో మృణాల్ కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. నానికి జంటగా హాయ్ నాన్న చేస్తుంది. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.
అలాగే విజయ్ దేవరకొండకు జంటగా మరో చిత్రం చేస్తుంది. పూజా హెగ్డే, రష్మిక మందాన జోరు తెలుగులో తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెకు ఆఫర్స్ పెరిగే సూచనలు కలవు. ఇదిలా ఉంటే తాజాగా ప్రేమపై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అని మీడియా అడగ్గా… అవును హీరో కీవు రీన్స్ ని చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే నాది వన్ సైడ్ లవ్ అని బాంబు పేల్చింది.
తాను సింగిల్, ఎవరినీ ప్రేమించడం లేదని పరోక్షంగా చెప్పింది. అందుకే హాలీవుడ్ నటుడు కీవు రీన్స్ పేరు చెప్పింది. ది మాట్రిక్స్, జాన్ విక్ చిత్రాలతో ఫేమస్ అయిన కీవు రీన్స్ కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. కాగా గతంలో మృణాల్ పెళ్లిపై భిన్నమైన అభిప్రాయాలు వెల్లడించింది. నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంది. అయితే ప్రస్తుతం నా దృష్టి కెరీర్ మీదే అని తాజాగా చెప్పింది.