Allu Arjun Caravan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. చిత్తూరు యాసలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో పుష్ప సినిమాకు సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమా ఇప్పుడు షూట్ పూర్తిచేసుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ కు వరుసగా సినిమా అవకాశాలు ఉన్నాయని టాక్. ఇదిలా ఉంటే ఆయన దగ్గర పని చేసే వారిని సొంతం ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారట బన్నీ.
అల్లు అర్జున్ ఎంత బాగా చూసుకుంటారో ఇప్పటికే వారి ఇంట్లో పని చేసేవారు చెప్పారు కూడా. ఇదిలా ఉంటే బన్నీ షూటింగ్ సమయంలో ఎక్కువగా తన క్యారవాన్ ఉపయోగిస్తుంటారు. దీనికి డ్రైవర్ లక్ష్మాణ్ అట. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తాను అల్లు అర్జున్ కు వీరాభిమాని అని.. తాను మొదట బోయపాటి శీను గారి దగ్గర పనిచేశానని.. అలా బోయపాటి నుంచి తాను అల్లు అర్జున్ వద్దకు వచ్చానని తెలిపారు. అల్లు అర్జున్ ను దగ్గర నుంచి చూసిన అనుభవంతో.. ఆయన చాలా మంచి మనుసు ఉన్నవారు అని తెలిపారు. అంతేకాదు వారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి పని వారిలా కాకుండా అందరిని సొంతింటి మనిషిలా చూస్తారని తెలిపారు. ఇక లక్ష్మణ్ పుట్టిన రోజున ప్రతి సంవత్సరం బన్నీనే దగ్గర ఉండి కేక్ కట్ చేయిస్తారట. దీన్ని కూడా గుర్తు చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు లక్ష్మణ్.
అలా వైకుంఠపురం సినిమా విడుదలైన తర్వాత బోనస్ రూపంలో చాలా డబ్బును కానుకగా ఇచ్చారట. ఇలా ఆయన మంచి తనం చూసిన లక్ష్మణ్ బన్నీ మీద ఉన్న అభిమానంతో టాటూ కూడా వేయించుకున్నారట. అయితే క్యారవాన్ మైంటైన్ చేయాలి అంటే ప్రత్యేకమైన శిక్షణ కూడా ఎంతో అవసరం. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ క్యారవాన్ తయారు చేయిస్తున్న సమయంలో లక్ష్మణ్ కూడా పూణేలో దాదాపు నెల రోజులపాటు అక్కడే ఉండి క్యారవాన్ ఎలా మైంటైన్ చేయాలి ఎలా డ్రైవ్ చేయాలి అనే విషయాలన్నింటి పై శిక్షణ తీసుకున్నారట.
అయితే ఈ క్యారవాన్ డ్రైవ్ చేయడానికి లక్ష్మణ్ కు ఏకంగా నెలకు రెండు లక్షల పైగా శాలరీ అందుతున్నట్లు వెల్లడించారు. ఇలా క్యారవాన్ డ్రైవర్ గా ఆయన అందుకునే జీతం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఆయనతో సెల్ఫీ దిగితే చాలు అనుకున్నాడంట కానీ ఇప్పుడు ఏకంగా ప్రతి పుట్టిన రోజుకు కేక్ కూడా అల్లు అర్జున్ కట్ చేయించడం ఆనందంగా ఉందంటూ తెలిపాడు.