https://oktelugu.com/

Siri Hanmanth: షణ్ముఖ్ అరెస్ట్ పై నోరు విప్పిన సిరి హన్మంత్… అందుకే దూరంగా ఉంటున్నా అంటూ!

షణ్ముఖ్ జస్వంత్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎంతో కష్టపడి తన కెరీర్ బిల్డ్ చేసుకున్నాడు. అలాంటి షణ్ముఖ్ గంజాయి కేసులో అరెస్ట్ అవ్వడం కలకలం సృష్టించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 27, 2024 / 08:41 AM IST

    Siri Hanmanth

    Follow us on

    Siri Hanmanth: యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ రన్నర్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. షణ్ముఖ్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అరెస్ట్ అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్ అరెస్ట్ నేపథ్యంలో అతని వ్యక్తిగత విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా షణ్ముఖ్ డ్రగ్స్ కి అలవాటు కావడానికి ఒత్తడి కారణమనే వాదన తెరపైకి వచ్చింది.

    షణ్ముఖ్ జస్వంత్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎంతో కష్టపడి తన కెరీర్ బిల్డ్ చేసుకున్నాడు. అలాంటి షణ్ముఖ్ గంజాయి కేసులో అరెస్ట్ అవ్వడం కలకలం సృష్టించింది. షణ్ముఖ్ జస్వంత్ డిప్రెషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయన నేరుగా వెల్లడించాడట. డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకోవాలి అనుకున్నట్లు షణ్ముఖ్ తెలిపాడట. అందుకే గంజాయి సేవిస్తునట్లు షణ్ముఖ్ స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడట. డిప్రెషన్ కి కారణం దీప్తి సునయన తో బ్రేకప్ అని కొందరు భావిస్తున్నారు.

    అలాగే బిగ్ బాస్ తర్వాత ఆఫర్స్ వస్తాయి అనుకుంటే .. కెరీర్ పరంగా పూర్తిగా డౌన్ అవ్వడం వల్లే షణ్ముఖ్ తట్టుకోలేక డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు అని అంటున్నారు.కాగా హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన విమర్శలకు దారి తీసింది. ఫ్రెండ్ షిప్ పేరుతో సిరి హనుమంత్ తో అత్యంత సన్నిహితంగా మెలిగాడు. ఇద్దరు హగ్గులు, ముద్దులతో రచ్చ చేశారు. షన్ను బిహేవియర్ నచ్చకే దీప్తి అతనికి బ్రేకప్ చెప్పింది అనే వాదన ఉంది. ప్రస్తుతం షణ్ముఖ్, దీప్తి సునైన ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు.

    తాజాగా సిరి హన్మంత్… షణ్ముఖ్ అరెస్ట్ పై స్పందించింది. సిరి మాట్లాడుతూ .. అతని పర్సనల్ లైఫ్ ఇలా అవుతుంది అని అనుకోలేదు. ఇక షణ్ముఖ్ కి బ్రేకప్ అయ్యాక అతన్ని కలవడం, మాట్లాడటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయాం. ఇక మళ్ళీ కలిసినా కలవకపోయినా షణ్ముఖ్ బాగుండాలి అని కోరుకుంటాను. కలవొచ్చు, కాకపోతే దానికి ఇంకా సమయం పడుతుంది అంటూ సిరి చెప్పుకొచ్చింది.