Shrihan In Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 కి సన్నాహాలు మొదలయ్యాయి. మరో నెల రోజుల్లో ప్రసారం ఉండగా కంటెస్టెంట్స్ ఎంపిక షురూ చేశారు. ఇప్పటికే తెరపైకి కొన్ని పేర్లు వచ్చాయి. తాజాగా శ్రీహాన్ పేరు వినిపిస్తోంది. శ్రీహాన్ అంటే తెలియకపోవచ్చు గానీ సిరి లవర్ అంటే ఈజీగా గుర్తొస్తాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి హైలెట్ అయ్యారు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఆమె ఒకరు. గత సీజన్లో ఆమె 5వ స్థానం దక్కించుకున్నారు. సిరితో పాటు శ్రీరామ్, మానస్, షణ్ముఖ్, సన్నీ ఫైనల్ కి చేరగా సన్నీ విన్నర్ అయ్యారు. రన్నర్ గా షణ్ముఖ్ మిగిలారు.

కాగా హౌస్ లో సిరితో షణ్ముఖ్ రొమాన్స్ హైలెట్ గా నిలిచింది. వీరిద్దరూ ఒకరి కోసం మరొకరు అన్నట్లు గడిపారు. స్నేహితులం అంటూనే హద్దులు మీరి రొమాన్స్ కురిపించారు. వీరిద్దరి ఎమోషనల్ డ్రామా అదిరిపోయింది. ముద్దులు, హగ్గులతో పాటు గొడవలు, అలకలు చోటు చేసుకునేవి. హౌస్ లో వీరి వ్యవహారం నచ్చని దీప్తి సునైన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. వారిద్దరూ విడిపోవడానికి సిరీనే కారణమని ప్రచారం జరిగింది. షణ్ముఖ్-దీప్తి సునైన బ్రేకప్ కహానీలో సిరి పేరు బాగా నలిగింది. ఈ క్రమంలో ఆమె వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Also Read: Manjula- Balakrishna: బాలయ్య హీరోయిన్ గా మహేష్ సిస్టర్… తిరగబడ్డ కృష్ణ ఫ్యాన్స్!

లవర్ శ్రీహాన్ మాత్రం ఆమెకు అండగా నిలబడ్డాడు. కాగా శ్రీహాన్ హౌస్ లోకి వెళితే రచ్చ రంబోలె అంటున్నారు. శ్రీహాన్ కి నిజంగా అవకాశం దక్కిందా లేదా అనేది తెలియదు. షో నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎపిసోడ్ వరకు కంటెస్టెంట్స్ డీటెయిల్స్ సీక్రెట్ గా ఉంచుతారు. అయితే దాదాపు అతడికి అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. మల్టీ టాలెంటెడ్ అయిన శ్రీహాన్ హౌస్ లో మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకోవడం ఖాయం. అలాగే అతని కెరీర్ కి కూడా షో బాగా ఉపయోగపడుతుంది. బిగ్ బాస్ హౌస్ ద్వారా ఫేమస్ అయిన అరియనా, అఖిల్, సోహైల్, సన్నీ కెరీర్స్ జెట్స్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. సోహైల్, సన్నీ హీరోలుగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ దక్కితే మనోడి కెరీర్ ఊపందుకున్నట్లే.
Also Read: Sarkaru Vaari Paata Record In OTT: OTT లో కూడా అరుదైన రికార్డు ని సృష్టించిన సర్కారు వారి పాట
Recommended Videos: