Single Movie : శ్రీవిష్ణు(Sree Vishnu) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్'(#Single Movie) బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాలు వీకెండ్ తర్వాత చల్లారిపోతాయి, ఈ సినిమా కూడా అంతే అని కొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేశారు. కానీ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటిన ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ రన్ ని కనబరుస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ ఏడాది గీత ఆర్ట్స్ నుండి విడుదలైన ‘తండేల్’ చిత్రం సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చిపెట్టింది కానీ, ‘సింగిల్’ చిత్రం మాత్రం ‘తండేల్’ కంటే భారీ లాభాలను తెచ్చిపెట్టే దిశగా ముందుకు దూసుకుపోతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రోజువారీగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ..ఎలాంటి స్టోరీ ని రెడీ చేశాడంటే!
మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, రెండవ రోజున 2 కోట్ల 20 లక్షల రూపాయిలు, మూడవ రోజున 2 కోట్ల 9 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా మూడు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతీ ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, నాల్గవ రోజున అనగా వర్కింగ్ డే లో 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. సోమవారం బ్లాక్ బస్టర్ హోల్డ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, మంగళవారం రోజున, అనగా ఐదవ రోజున కూడా అదే రేంజ్ హోల్డ్ ని కనబరుస్తూ 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 3 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి 84 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 3 కోట్ల 19 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 2 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఈ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండి ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read : అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!