Single Movie Collection: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు శ్రీ విష్ణు(Sree Vishnu). తన ప్రతీ సినిమాతోనూ ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి ని ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఆయన గత చిత్రం ‘స్వాగ్’ అలాంటిదే. అందులో ఆయన ఏకంగా 5 క్యారెక్టర్స్ చేసాడు. కానీ థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు కానీ, ఓటీటీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యినందుకు శ్రీ విష్ణు చాలా బాధపడ్డాడు. అందుకే తన తదుపరి చిత్రాన్ని తనకు బాగా కలిసొచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నాడు. నిన్న ఆయన హీరో గా నటించిన ‘సింగిల్'(#Single Movie) అనే చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. శ్రీ విష్ణు హీరో గా నటించిన ఈ చిత్రం లో కేతిక శర్మ(Ketika Sharma), ఇవానా(Ivana) హీరోయిన్స్ గా నటించారు.
Also Read: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ ఆ హిట్ సినిమా కి రీమేక్ గా రాబోతోందా..?
నిన్న విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ, ఎందుకో మార్నింగ్ షోస్ మరియు మ్యాట్నీ షోస్ కి ఆక్యుపెన్సీలు సరిగా నమోదు అవ్వలేదు. హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ ని ఎదురుకోవాల్సి వస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఫస్ట్ షోస్ నుండి వసూళ్లు బాగా పుంజుకున్నాయి. ఫలితంగా మొదటి రోజు వరల్డ్ వైడ్ డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ప్రాంతాల వారీగా ఒకసారి ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూస్తే నైజాం ప్రాంతం లో మొదటి రోజు దాదాపుగా 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం లో 16 లక్షలు, ఆంధ్ర ప్రాంతం లో 52 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రం మొదటి రోజు 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 2 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని మరో 4 కోట్ల 66 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. మొదటి రోజు కంటే అన్ని ప్రాంతాల్లోనూ రెండవ రోజే ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 6 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.