Single Collection: శ్రీవిష్ణు(Sree Vishnu) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్'(#Single Movie) ఇటీవలే విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కార్తీక్ రాజు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ ఛితంలో హీరోయిన్స్ గా కేతిక శర్మ, ఇవానా నటించారు. వెన్నెల కిషోర్ ఇందులో సెకండ్ హీరోగా నటించాడు. శ్రీవిష్ణు వెన్నెల కిషోర్ మధ్య వచ్చిన కామెడీ థియేటర్స్ లో ప్రేక్షకులను పొట్ట చెక్కలు అయ్యేలా చేసింది. అందుకే ఈ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘తండేల్’ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న గీతా ఆర్ట్స్ ఇప్పుడు ‘సింగిల్’ తో మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
Also Read: అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో ఎక్కువ భాగం అండర్ వాటర్ లోనే ఉంటుందా..?
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కేవలం కోటి 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. పాజిటివ్ టాక్ పబ్లిక్ లో చాలా బలంగా ఉండడంతో రెండవ రోజు ఏకంగా 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడవ రోజు కూడా ఈ చిత్రానికి మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం మూడవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల 9 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మూడు రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే ఒక్క నైజాం ప్రాంతంలోనే ఈ చిత్రానికి 2 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా సీడెడ్ లో 66 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఆంధ్రా ప్రాంతం లో 2 కోట్ల 45 లక్షల రూపాయిలను రాబట్టింది. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 2 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే కేవలం మూడు రోజుల్లోనే కోటి రూపాయిల లాభం వచ్చింది అన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు. నేడు వర్కింగ్ డే, నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు రెండు వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.