https://oktelugu.com/

Singer Sunitha: 43 ఏళ్ల వయసులో మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ సింగర్

Singer Sunitha: సింగర్ సునీత గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. సునీత గర్భవతి అని మళ్ళీ పుకార్లు పుట్టించారు. సరోగసి ద్వారా పిల్లలను కనాలని సునీత నిర్ణయించుకుందని గతంలోనే రూమర్స్ వచ్చాయి. మళ్ళీ తాజాగా ఈ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ పుకార్లలో నిజం ఉందా అని ఆరా తీస్తే.. సునీత మాత్రం మళ్లీ తల్లి కావాలనే ఆలోచనలో ఉందట. కాకపోతే, సరోగసి ద్వారానే పిల్లలను కనాలని ఆమె […]

Written By:
  • Shiva
  • , Updated On : April 22, 2022 / 04:46 PM IST
    Follow us on

    Singer Sunitha: సింగర్ సునీత గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. సునీత గర్భవతి అని మళ్ళీ పుకార్లు పుట్టించారు. సరోగసి ద్వారా పిల్లలను కనాలని సునీత నిర్ణయించుకుందని గతంలోనే రూమర్స్ వచ్చాయి. మళ్ళీ తాజాగా ఈ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ పుకార్లలో నిజం ఉందా అని ఆరా తీస్తే.. సునీత మాత్రం మళ్లీ తల్లి కావాలనే ఆలోచనలో ఉందట.

    Singer Sunitha

    కాకపోతే, సరోగసి ద్వారానే పిల్లలను కనాలని ఆమె ప్లాన్ చేస్తోంది. సునీత రెండో భర్త రామ్ పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్. అందుకే డిజిటల్ లోకి సునీత కూడా ఎంటర్ కానుంది. సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉంది. అయితే, ఆ చిన్న చిత్రాల నిర్మాణ పరంపరను సునీత నేపథ్యంలో సాగుతుందని.. కథల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణం వరకు అన్నీ ఆమె చూసుకుంటుందని తెలుస్తోంది.

    Also Read: Mike Tyson: వైరల్ వీడియో: విసిగించిన అభిమానిని విమానంలో చితక్కొట్టిన మైక్ టైసన్

    పైగా సునీతనే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. సింగర్ గా ఎంతో పాపులారిటీ సాధించిన సునీత, మరి నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సునీతకు బుల్లితెర పై బోలెడు అభిమానులు ఉన్నారు, అందుకే సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తోంది. మొత్తానికి భర్త రామ్‌ వీరపనేని కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తున్నాడు.

    Singer Sunitha

    సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్‌ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. నిజానికి ఎన్నో ఏళ్ల పాటు సునీత ఒంటరి జీవితాన్ని గడిపింది. ఆ సమయంలో ఆమె చాల ఇబ్బందులు పడింది. ఎన్ని కష్టాలు పడినా సునీత మాత్రం ఎక్కడా నిరుత్సాహపడలేదు.

    ఏది ఏమైనా సునీత గాత్రం ఎంతో కమ్మగా ఉంటుంది. ఆమె చీర కట్టు ఆమెలోని తెలుగుతనాన్ని ఆహ్లాదకరంగా మారుస్తోంది. ఇప్పటి హీరోయిన్స్ కంటే.. ఎంతో అందంగా కనిపించే సునీత ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

    Also Read:Jr NTR: ఆ హీరో స్ఫూర్తితోనే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష..!

    Recommended Videos:

    Tags