Ram Veerapaneni: సింగర్ సునీత తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన భర్తతో హాయిగా ఉంది సునీత. అయితే, సునీత భర్త ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో వీడియోస్’ అధినేత అని తెలిసిందే. కాగా రామ్ వీరపనేని తాజాగా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తన ఛానల్ లో రిలీజ్ చేసిన కొన్ని వీడియోల్లో గౌడ మహిళలను వేశ్యలుగా చూపించారంటూ గౌడ కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ క్రమంలోనే మ్యాంగో వీడియోస్ కార్యాలయంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. కాకపోతే వివాదంలో చిక్కుకున్న సింగర్ సునీత భర్త అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ వీరపనేని మంచి బిజినెస్ మ్యాన్. డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్.. ఒక విధంగా డిజిటల్ మీడియాలో మొఘల్ లాంటి వాడు. అందుకే ఆయనను ఇండస్ట్రీలో మ్యాంగో రామ్ అంటారు. రామ్ వీరపనేని ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు.
Also Read: తగ్గేదేలే.. ఏడు భాషల్లో కొత్త మీడియాతో రవిప్రకాష్ రె‘ఢీ’

సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. రామ్ వీరపనేని కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తున్నాడు. అన్నట్టు సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో ఒక సరికొత్త ప్రోగ్రాంతో తెలుగు లోగిళ్ళలోకి రాబోతుంది. దీనికి నిర్మాత రామ్ వీరపనేనినే. ఏది ఏమైనా సునీత గాత్రంతో తన చీర కట్టుతో ఆకట్టుకుంటుంది. మరి రామ్ వీరపనేని తాజాగా వివాదంలో చిక్కుకోవడం పై సునీత ఇంకా స్పందించలేదు.
Also Read: రైలులో లగేజీని మర్చిపోయారా..? తిరిగి పొందాలంటే ఇలా చేయండి!