Singer S Janaki Son: ప్రముఖ గాయినీ ఎస్ జానకి(S Janaki) కుమారుడు మురళీ కృష్ణ(Murali Krishna) నేడు కన్నుమూసారు. ఈ విషయాన్నీ ప్రముఖ గాయినీ చిత్ర సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. మురళీ కృష్ణ కి 65 ఏళ్ళ వయస్సు ఉంటుంది. తల్లి సినీ రంగంలో సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి, లెజండరీ స్థానాన్ని సంపాదిస్తే, కొడుకు మురళీ కృష్ణ భారత నాట్యంలో గొప్ప ప్రావిణ్యం సంపాదించాడు. తన తల్లి పలుకుబడిని ఏనాడూ కూడా ఉపయోగించుకొని మురళీ కృష్ణ తన సొంత టాలెంట్ తోనే కొన్ని సినిమాల్లో అవకాశాలు సంపాదించాడు. గతం లో ఆయన వినాయకుడు, మల్లెపువ్వు వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇక మురళీ కృష్ణ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన చెన్నై కి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. గత కొంతకాలం నుండి అనారోగ్యం తో బాధపడుతున్న మురళీ కృష్ణ, నేడు చికిత్స పొందుతూ తుదిశ్వాసని విడిచారు.
ఆయన మృతి పట్ల సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ జానకి వయస్సు ప్రస్తుతం 87 ఏళ్ళు. ఇంత పెద్ద వయస్సులో కన్నకొడుకు చనిపోతే, ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. గత కొంతకాలం నుండి సినిమాలకు దూరం గా తన కుటుంబం తో చెన్నై లోనే నివసిస్తుంది ఎస్ జానకి. తెలుగు, తమిళం, హిందీ,కన్నడ , మలయాళం భాషల్లో ఎన్నో వందల పాటలు పాడింది ఎస్ జానకి. తెలుగు లో ఆమె చివరిగా పాడిన పాట ‘అమ్మా అని పిలిచి పిలిచి’. సింహరాశి చిత్రం లో హీరో రాజశేఖర్ బాల్యం లో ఉన్నప్పుడు వచ్చే పాట ఇది. ఈ పాట వింటే ఇప్పటికీ మన కళ్ళల్లో నీళ్లు ఆగవు. అలాంటి గొప్ప పాటతో తెలుగు లో ఆమె తన సినీ కెరీర్ ని ముగించింది.
కానీ తమిళం లో ఆమె చాలా కాలం గ్యాప్ తర్వాత 2014 వ సంవత్సరం లో విడుదలైన ‘రఘువరన్ బీటెక్’ లో ‘అమ్మా అమ్మా నేను పసివాడినమ్మా’ పాటని పాడింది. ఈ పాట ధనుష్ తల్లి చనిపోయినప్పుడు వస్తుంది. ఇలా దశాబ్దాల పాటు మ్యూజిక్ లవర్స్ ని అలరించిన ఎస్ జానకి, వృద్దాప్యం లో పుత్ర శోకం కలగడం నిజంగా అత్యంత బాధాకరం. ఆమెకు, ఆమె కుటుంబానికి ఈ కీలక సమయం లో ఆ దేవుడు కొండంత ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, మురళీ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.