
Rahul Sipligunj About Ashu Reddy: తెలుగు ప్రేక్షకులకు సింగర్ గా.. బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj ) పేరు తెలియని వారు ఉండరు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక అతడి పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ లో హీరోయిన్లతో రోమాన్స్ చేస్తూ రాహుల్ అందరినోళ్లలోనూ నానాడు. ముఖ్యంగా పునర్నవితో రాహుల్ రోమాన్స్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
అయితే ఇదే బిగ్ బాస్ హౌస్ లో అషురెడ్డితో కూడా స్నేహంగా ఉండేవాడు రాహుల్. కానీ బయటకు వచ్చాక మాత్రం అషురెడ్డి తోనే ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారిద్దరి మధ్య ఎఫైర్ కూడా ఉందన్న ప్రచారం మొదలైంది.
ఈ నేపథ్యంలో అషు-రాహుల్ ఈ మధ్య ప్రైవేటు సాంగ్ ల్లో నటిస్తూ రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు రాహుల్ ను సూటిగా ప్రశ్నించారు. మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమనా? అని.. అయితే ఓ నెటిజన్ మాత్రం మీరిద్దరూ ‘మంచి స్నేహితులు’ అని పేర్కొనగా.. ఆ కామెంట్ కు రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. షేర్ చేశాడు.
‘మాది ఫ్రెండ్ షిప్ అని గుర్తించిన మొట్ట మొదటి వ్యక్తివి నువ్వే’ అని నెటిజన్ కు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రైవేటు సాంగ్ కోసం అషురెడ్డి (Ashu Reddy) ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మూడు రోజులు నటించిందని.. ఆమె స్నేహానికి నేను ఎంతో కృతజ్ఞడిని అని రాహుల్ గుర్తు చేసుకున్నాడు. తనకు అషూ ఎంతో సాయం చేసిందని చెప్పుకొచ్చాడు. స్నేహం కోసం అషూ ఎంత సపోర్టు చేస్తుందో తనకు తెలుసు అని.. ఆమె నా నిజమైన ఫ్రెండ్ అని రాహుల్ వివరించారు. దీంతో వారి మధ్యనున్న ప్రేమ ఊహాగానాలకు చెక్ పడింది.