Singer Kalpana : ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఒత్తిడి ని తట్టుకోలేక అధిక మోతాదు నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మీడియా లో ఆమె అఘాయిత్యానికి పాల్పడింది అంటూ వార్తలు రావడం వంటివి మనం గత రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాం. అంతే కాదు తన కూతురు ని ఇంటికి తిరిగి రమ్మంటే రాలేదని, అందుకే కల్పన ఇలాంటి పని చేసిందని కూడా వార్తలు వినిపించాయి. వీటిపై ఆమె కూతురు మీడియా తో మాట్లాడుతూ ‘మా అమ్మ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. మా కుటుంబం లో ఎలాంటి విబేధాలు లేవు, దయచేసి మీడియా ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టండి’ అంటూ చెప్పుకొచ్చింది. జరిగిన ఘటన పై కల్పన స్పందన కోసం మీడియా మొత్తం ఎదురు చూస్తున్న సమయంలో నిన్న ఆమె ఒక వాస్తవాలను చెప్తూ ఒక వీడియో ని విడుదల చేసింది.
Also Read : మా అమ్మపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దు అంటూ సింగర్ కల్పన కూతురు ఎమోషనల్ కామెంట్స్!
ఆమె మాట్లాడుతూ ‘మీడియా లో గత రెండు రోజులుగా నాపై, నా కుటుంబ సభ్యులపై వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. అదంతా తప్పుడు ప్రచారం, దాని గురించి పూర్తి వివరణ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. మా కుటుంబం లో ఎలాంటి మనస్పర్థలు లేవు, నేను, నా భర్త, కూతురు ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎంతో అన్యోయంగా, ఆప్యాయతతో జీవిస్తున్నాము. నా వయస్సు ఇప్పుడు 45 ఏళ్ళు. ఈ వయస్సులో నేను PHD , LLB చేస్తున్నాను. మా భర్త పూర్తి సహకారం వల్లే నేను ఇలా చేయగలుగుతున్నాను. కానీ నాకు వృత్తి పరంగా ఒత్తిడి పెరిగిపోయింది. రాత్రులు నిద్ర పట్టడం లేదు. దీంతో నేను వైద్యులు సూచించిన టాబ్లెట్స్ ఓవర్ డోస్ వేసుకున్నాను. అందుకే స్పృహ కోల్పాయాను, శకలం లో అపార్ట్మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు, పోలీసుల సహకారం వల్ల ఇలా నేను మీ ముందుకొచ్చి కూర్చోగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నా భర్త తో విబేధాలు ఉన్నట్టు కూడా మీడియా లో ప్రచారం చేసారు. అలాంటిదేమి లేదు, ఆయన నా దృష్టిలో దేవుడిలాంటి వాడు. నాకు ప్రతీ విషయంలో తోడు ఉంటాడు. భగవంతుడు నాకు ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఆయన.’ అంటూ చెప్పుకొచ్చింది కల్పన. త్వరలోనే మళ్ళీ పాటలతో మిమ్మల్ని అలరిస్తానని, నా ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిన అభిమానులకు కృతఙ్ఞతలు అంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ప్రాంతీయ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సింగర్ కల్పన, తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. అంతే కాదు ప్రతీ సీజన్ లో అతిథి గా విచ్చేసి ప్రత్యేకంగా పాటలు కూడా పాడుతూ ఉంటుంది. గత సీజన్ లో కూడా ఆమె దసరా స్పెషల్ ఎపిసోడ్ లో అతిథిగా విచ్చేసి కంటెస్టెంట్స్ గురించి పాటలు పాడిన సంగతి తెలిసిందే.
Also Read : కూతురు వల్లే సింగర్ కల్పన చనిపోవాలని అనుకుందా..? స్పృహలోకి వచ్చిన తర్వాత సంచలన నిజాలు బయటపెట్టిన కల్పన!
నా భర్తతో విభేదాలు ఏమి లేవు
ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ సూచనతో మెడిసిన్ వాడుతున్నా
దాని డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లా – సింగర్ కల్పన https://t.co/YE3joDJH1V pic.twitter.com/LjbhbhWzV4
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2025